
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ వేదికగా సాగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపాయి. సమావేశాలకు ఏర్పాట్లు బాగా చేశారంటూ రాష్ట్ర నేతలను బీజేపీ పెద్దలు అభినందించారు. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభకు జన సమీకరణ బాగా చేశారంటూ సభా వేదికపైనే బండి సంజయ్ ని భుజం తట్టి అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రధాని మోడీ ప్రసంగమే తెలంగాణ బీజేపీ కేడర్ ను నిరుత్సాహానికి గురి చేసింది. బీజేపీ సభకు ముందు రోజే విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను హైదారాబాద్ రప్పించి ప్రచార సబ ఏర్పాటు చేశారు. యశ్వంత్ కు ఊహించని విధంగా స్వాగతం చెప్పారు. బీజేపీ ధీటుగా నగరమంతా ఫ్లైక్సీలు, బ్యానర్లు కట్టారు. అంతేకాదు సిన్హా సభలో బీజేపీ సర్కార్ ను, ప్రధాని మోడీని తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు కేసీఆర్. మోడీని ఏకంగా సేల్స్ మెన్ తో పోల్చారు. నరేంద్ర మోడీపై అవినీతి ఆరోపణలు చేశారు. దేశ సమస్యలకు సంబంధించి తొమ్నిది ప్రశ్నలు సంధించి… పరేడ్ గ్రౌండ్స్ పబ్లిక్ మీటింగ్ లో సమాధానం చెప్పాలని మోడీకి సవాల్ చేశారు కేసీఆర్.
Read More : చక్కని జీవితం..కానీ.. భార్య ఏమిచేసిందంటే?
సీఎం కేసీఆర్ ఆరోపణలు, టీఆర్ఎస్ ఫ్లైక్సీ రాజకీయాలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీ సీరియస్ గా ఉన్నారనే ప్రచారం సాగింది. హెఐసీసీలో బండి సంజయ్, లక్ష్మణ్ తో డిన్నర్ మీటింగ్ నిర్వహించిన మోడీ.. కేసీఆర్ రాజకీయాలపై ఆరా తీశారని తెలిసింది. దీంతో పరేడ్ గ్రౌండ్ సభలో కేసీఆర్ టార్గెట్ గా ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుందని అంతా భావించారు. మే నెలలో అధికారిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన మోడీ.. బేగంపేట ఎయిర్ పోర్టులో పార్టీ నేతల సమావేశంలో ప్రసంగించారు. ఆ సందర్భంగా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతుందని బహిరంగ సభ. చిన్న సభలోనే కేసీఆర్ పై ఆరోపణలు చేసిన మోడీ.. బహిరంగ సభలో మరింతగా విరుచుకుపడుతారనే అంతా అనుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా అదే ఆశించారు. కాని సీన్ రివర్సైంది. సికింద్రాబాద్ సభలో కనీసం కేసీఆర్ పేరు పలకలేదు ప్రధాని మోడీ. టీఆర్ఎస్ పేరును కూడా ఉచ్చరించలేదు. దాదాపు 27 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోడీ..కేసీఆర్, టీఆర్ఎస్ పేరు ఎందుకు ప్రస్తావించలేదన్నది చర్చగా మారింది.
Read More : మంచి బ్రాండ్లు కావాలని నినాదిద్దాం.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు
కేసీఆర్ చేసిన ఆరోపణలు కౌంటరిస్తారని భావిస్తే.. కేవలం కేంద్ర సర్కార్ పథకాల గురించే మాట్లాడారు ప్రధాని మోడీ. ప్రధాని కన్నా ముందు మాట్లాడిన హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్, కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ మాత్రం కేసీఆర్ ను , టీఆర్ఎస్ సర్కార్ తీరును ఎండగట్టారు. కుటుంబ, అవినీతి పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. బీజేపీ అగ్రనేతలంతా కేసీఆర్ లక్ష్యంగా ప్రసంగింస్తే.. ప్రధాని మోడీ ఎందుకు కేసీఆర్ ను టార్గెట్ చేయలేదన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మోడీ ప్రసంగం వ్యూహాత్మకంగా సాగిందనే చర్చ వస్తోంది. కావాలనే కేసీఆర్ పేరు ఎత్తకుండా మోడీ మాట్లాడారని అంటున్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని, నిధులు ఇవ్వడం లేదని కొంత కాలంగా కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల వివరాలు చెబూతూ… గులాబీ నేతల నోరు మూయించే ప్రయత్నం ప్రధాని మోడీ చేశారంటున్నారు.
Also Read : మునుగోడు టీఆర్ఎస్ టికెట్ బీసీకే! పీకే సర్వేలో నారబోయినే టాప్?
సికంద్రాబాద్ సభలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. కమలం కేడర్ ను ఉత్సాహపరచలేదని చెప్పారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక మోడీ తోక ముడిచారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీకి టీఆర్ఎస్ మిత్రపక్షమని… మిత్ర ధర్మాన్ని పాటిస్తూ కేసీఆర్ ను విమర్శించకుండా ప్రధాని మోడీ ప్రసంగం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. అయితే బీజేపీ నేతలు మాత్రం అంతా వ్యూహాం ప్రకారమే వెళుతుందంటున్నారు. ఇది తుపాను ముందు ప్రశాంతతేనని.. ముందు ముందు కేసీఆర్ కు సినిమా ఉంటుందని చెబుతున్నారు. తమను రెచ్చగొట్టేలా వ్యవహరించిన కేసీఆర్ పై బీజేపీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉందని.. త్వరలోనే తెలంగాణలో సంచనాలు జరగబోతున్నాయని అంటున్నారు. కేసీఆర్ అవినీతికి సంబంధించి చిట్టా మొత్తం కేంద్రం సేకరించిందని బీజేపీ వర్గాల వాదన. మొత్తంగా బీజేపీ విజయ్ సంకల్ప్ సభలో ప్రధాని మోడీ స్పీచ్ ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో బీజేపీ వ్యూహం ఏంటనే సరికొత్త చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి …
- విశ్వా కర్మల నిరసన అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా.
- తెలంగాణ బీజేపీకి ప్రధాని మోడీ షాక్… కేసీఆర్, టీఆర్ఎస్ పేరు ఎత్తకుండానే ప్రసంగం
- ఇంకా ఎన్నాళ్లూ… ప్రజల్ని మభ్యపెడతావు.. ఏజెంట్లను దొంగలు చేసే ప్రయత్నం చేస్తావా?
- రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సీనియర్ నేత..
- ప్రధానిలా కాదు సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు.. నరేంద్ర మోడీపై కేసీఆర్ నిప్పులు
2 Comments