
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ ఊహించని షాక్ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించింది తెలంగాణ బీజేపీ. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా జన సమీకరణ చేశారు కమలం నేతలు. శనివారం జరిగిన యశ్వంత్ సిన్హా ప్రచార సభలో బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. ప్రధాని మోడీపై దారుణమైన విమర్శలు చేశారు. ఏకంగా మోడీని సేల్స్ మెన్ తో పోల్చారు. దీంతో సికింద్రాబాద్ సభలో కేసీఆర్ ఆరోపణలకు ప్రధాని మోడీ దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తారని తెలంగాణ బీజేపీ నేతలు భావించారు. ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ ను చెడుగుడు ఆడుకుంటారని కమలం లీడర్లు చెప్పారు. కాని పరేడ్ గ్రౌండ్స్ సభలో అంతా రివర్సైంది.
Read More : ఇంకా ఎన్నాళ్లూ… ప్రజల్ని మభ్యపెడతావు..
బీజేపీ విజయ సంకల్ప సభలో 27 నిమిషాలు ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా కేసీఆర్ పేరు పలకలేదు. టీఆర్ఎస్ పేరు ఎత్తలేదు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారును అధికారంలోకి తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ఎక్కడా కేసీఆర్ సర్కారుపై విమర్శల జోలికి వెళ్లని ప్రధాని మోడీ.. రాజకీయాల ఊసెత్తలేదు. గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందనే విషయాలను వెల్లడించడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.తెలంగాణ కళాత్మకతను, వీరత్వాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. ఈ సభకు హాజరైన వారిని చూస్తే తెలంగాణ మొత్తం ఇక్కడే ఉందనిపిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను చూసే ఈసారి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించామన్నారు. గత రెండు రోజులుగా పార్టీ ప్రతినిధులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. మీ ప్రేమను పొందారన్నారు. హైదరాబాద్ నగరం అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తోందన్నారు.
Read More : రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సీనియర్ నేత..
దేశ పురోగతి కోసం బీజేపీ ప్రభుత్వం రేయింబవళ్లు పని చేస్తున్నాయన్న ప్రధాని మోదీ.. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సభకు ఎంతో విశిష్టత ఉందన్నారు. తెలంగాణ ప్రజలు దేశ పురోగతి కోసం శ్రమిస్తున్నారని మోదీ కొనియాడన్నారు. తెలంగాణ ప్రజల కళాకౌశలాన్ని మోదీ కొనియాడారు. తెలంగాణ ప్రాచీన పరాక్రమాల గడ్డ అని ప్రశంసించారు.భద్రాచలం శ్రీరాముడు.. యాదాద్రి లక్ష్మీ నరసింహుడు, ఆలంపూర్ జోగులాంబ, వరంగల్ భద్రకాళి.. ఇలా దేవుళ్లందరి ఆశీస్సులు మనకు ఉన్నాయన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయం, కాకతీయ కళాతోరణం తెలంగాణ కళలకు నిదర్శనమన్నారు.. రుద్రమ దేవి, కొమురం భీమ్‌ల వీరత్వాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ… పాల్కూరికి సోమనాథుడి రచనలను గుర్తు చేశారు.
Also Read : ప్రధానిలా కాదు సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు.. నరేంద్ర మోడీపై కేసీఆర్ నిప్పులు
తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందన్న ప్రధాని.. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. గత 8 ఏళ్లుగా భారతీయుల జీవనంలో సకారాత్మక మార్పు తీసుకొచ్చామన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీల ఆంకాక్షలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు.తెలంగాణ పేదల పట్ల సేవాభావంతో పని చేస్తున్నామన్న ప్రధాని మోదీ.. అందుకే తెలంగాణ ప్రజల్లోనూ బీజేపీ పట్ల విశ్వాసం పెరుగుతోందన్నారు. మీ ప్రేమ, ఉత్సాహం.. దేశం మొత్తం చూస్తోందన్నారు. 2019 ఎన్నికల నుంచి తెలంగాణలో బీజేపీ పట్ల నమ్మకం పెరుగుతోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరిందన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారును తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.తెలంగాణలో గ్రామ గ్రామానికి కేంద్ర ప్రభుత్వ ఫలాలు అందాయన్న ప్రధాని మోదీ.. జన్ ధన్ యోజనతో దేశంలో కోట్లాది బ్యాంకు ఖాతాలను తెరిచామన్నారు. చిరు వ్యాపారుల కోసం ముద్ర రుణాలు అందించామన్నారు. ముద్ర రుణాల్లో ఎక్కువ భాగం మహిళలకే అందించామన్నారు.
ఇవి కూడా చదవండి …
- ఈటల రాజేందర్ మరో ఏక్ నాథ్ షిండేనా? కేసీఆర్ ముందే గ్రహించి అప్రమత్తమయ్యారా?
- చెరువులో దూకి తొమ్మిదో తరగతి ప్రేమికుల ఆత్మహత్య
- ప్రధాని మోడీ ముందు టీఆర్ఎస్ బలప్రదర్శన.. హైదరాబాద్ లో హై టెన్షన్
- చక్కని జీవితం..కానీ.. భార్య ఏమిచేసిందంటే?
- మంచి బ్రాండ్లు కావాలని నినాదిద్దాం.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు
3 Comments