
- కోర్టు ఆదేశాలుంటే భూమిని స్వాధీనం చేసుకో…
- ప్లాట్లుగా విభజించి పేదలకు పంచు
- కోర్టునీ పిటిషన్లన్నీ తిరస్కరించిందని మాకు తెలుసు
- అయినా నాకు ఆర్డర్ ఉందంటూ బుకాయింపు ఎందుకు..?
- క్రైమ్ మిర్రర్ ను బెదిరించాలనుకోవడం అవివేకం
- నువ్వు పరువు నష్టం దావా వేస్తే ఎదుర్కోవడానికి సిద్ధం
- హైకోర్టు న్యాయవాది షేక్ జిలానికి క్రైమ్ మిర్రర్ సవాల్
- ఈ విషయంలో చర్చకు ఎక్కడకైనా మేము రెడీ…!
- డబ్బులు నువ్వు తింటూ… ఏజెంట్లను దొంగలు చేసే ప్రయత్నం చేస్తావా?
- 500 ఎకరాల్లో ప్లాట్లు ఇస్తానని ప్రకటన చేసింది నువ్వు కాదా??
” హైకోర్టు అడ్వకేట్ షేక్ జిలాని కి క్రైమ్ మిర్రర్ దినపత్రిక తరఫున కొన్ని ప్రశ్నలు సూటిగా సంధిస్తున్నాం. దమ్ముంటే వీటికి సమాధానం చెప్పు.. నా వద్ద ఆర్డర్ కాపీలు ఉన్నాయి… త్వరలోనే భూమి స్వాధీనం చేసుకొని, 30 వేల మంది పేదలకు ప్లాట్లు పంచుతానని చెబుతున్నావు. మనసురాబాద్ సర్వేనెంబర్ 1 నుంచి 250 వరకు ఉన్న వేలాది ఎకరాలు ముంత కాబ్ ఆధారంగా తమకే సంక్రమిస్తాయని చెబుతున్నావ్. సరే, ఒక్క నిమిషానికి అలాగే అనుకుందాం. ఇప్పుడు సర్వేనెంబర్ ఒకటి నుంచి 250 వరకు ఉన్న వేలాది ఎకరాల భూమిని కాదని, సర్వే నెంబరు ఏడు లో ఉన్న అటవీ శాఖ భూములను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నావో చెప్పు. ఎందుకంటే ఫారెస్ట్ భూములు అయితే ప్రశ్నించేవాడు ఉండడు… ప్రజలకు ఎన్ని కథలైనా చెప్పవచ్చును అన్నది నీ ప్లాన్.. ఇక నాకు కోర్టు ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి అంటున్నావు.
Read More : ప్రధానిలా కాదు సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు.. నరేంద్ర మోడీపై కేసీఆర్ నిప్పులు
నువ్వు కోర్టులో వేసిన పిటిషన్ లన్ని గంపగుత్తగా కోర్టు తిరస్కరించి లోయర్ కోర్టుకు వెళ్ళమని ఆర్డర్ చేసింది నిజం కాదా?. టైటిల్ కోసం లోయర్ కోర్టుకు వెళ్లేందుకు నువ్వు భయపడుతున్నది నిజమేనన్న విషయము నీ ఏజెంట్లకు కూడా తెలుసు. వాళ్లే మరొక అడ్వకేట్ తో సంప్రదింపులు జరిపి, లోయర్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయమని వేడుకున్న మాట అబద్దమా?. అసలు నీ వద్ద ఎటువంటి ఆర్డర్ లేదన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ, నువ్వు మరొకసారి ప్రజలను మభ్య పెట్టేందుకు యూట్యూబ్ చానళ్ల ముందుకు వచ్చి, నీకు తోచింది చెబితే భయపడడానికి క్రైమ్ మిర్రర్ దినపత్రిక సిద్ధంగా లేదు. క్రైమ్ మిర్రర్ దినపత్రిక తప్పుడు కథనాలు రాస్తుందని పేర్కొన్నావు కదా… షేక్ జిలాని గారు, మావి తప్పుడు కథనాలు అయితే, క్రైమ్ మిర్రర్ పై నువ్వు తక్షణమే పరువు నష్టం దావా వేసుకోవచ్చు.. నీ పరువు నష్టం దావాను కోర్టులో ఎదుర్కొనేందుకు, క్రైమ్ మిర్రర్ దినపత్రిక సిద్ధంగా ఉన్నది. ఇక నీ ఉడుతా ఊపులకు, తాటాకు చెప్పులకు మేము బెదిరే రకం కాదు. పేదల పక్షాన మా అక్షర యజ్ఞం ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటాం..ముంత కాబ్ బాధితులు అందరికీ న్యాయం జరిగే వరకూ చట్ట ప్రకారం వారు పోరాడే విధంగా ప్రోత్సహిస్తూనే ఉంటాం. మా వంతుగా మీ అక్రమాలపై అక్షర తూటాలను ఎక్కుపెడుతూనే ఉంటాం.
Also Read : చక్కని జీవితం..కానీ.. భార్య ఏమిచేసిందంటే?
ముంత కాబ్ అన్నది అసలు చెల్లుబాటులోనే లేనప్పుడు, షేక్ జిలాని గారు… నీ సహచరులు యూసుఫ్ ఖాన్, సతీష్ లకు కోర్టు ఎందుకు భూములను కట్టబెడుతుందో ప్రజలకు సూటిగా, సుత్తి లేకుండా సమాధానం చెప్పు. ఈ విషయంలో చర్చకు క్రైమ్ మిర్రర్ ఏ వేదిక మీదనైనా చర్చించడానికి సిద్ధంగా ఉంది.. ముంత కాబ్ పేరిట కొత్త అప్లికేషన్లను తీసుకోవడం లేదని షేక్ జిలాని గారు మీరు పేర్కొన్నారు.. 500 ఎకరాలలో కొత్త వెంచర్ సిద్ధం చేస్తున్నామని మీ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రకటన పోస్టర్ ను అతికించింది మీరు కాదా?… దీనికి సూటిగా సమాధానం చెప్పండి. ఇకపోతే తాను కోర్టు ఖర్చుల నిమిత్తం కేవలం 30 వేల రూపాయలు మాత్రమే ఫీజు రూపంలో తీసుకుంటున్నానని, మిగిలింది ఏజెంట్లు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చావు సరే సరే… మీరు 30 వేల రూపాయల నుంచి మొదలు ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని క్రైమ్ మిర్రర్ దినపత్రిక కథనంలో పేర్కొనడం జరిగింది.
Also Read : చేరికలతో పెరిగిన వర్గ పోరు.. రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుర్రు
అంటే మేము రాసిందాంట్లో ఇంకా తప్పు ఎక్కడ ఉంది. మీరే స్వయంగా 30 వేల రూపాయలు కోర్టు ఫీజు రూపంలో తీసుకుంటున్నామని అంగీకరించారు.. ఇక ఆ మిగిలిన మొత్తం మీ ఏజెంట్లు తీసుకుంటున్నారని చెప్పకనే చెప్పుకొచ్చారు. ఇంకా క్రైమ్ మిర్రర్ దినపత్రిక తప్పుడు కథనాలను ఎక్కడ రాసినట్లు షేక్ జిలాని గారు సమాధానం చెప్పండి.. నాకు కోర్టు ఆర్డర్ ఉన్నది అని మీరు బల్ల గుద్ది వాదిస్తున్నారు కదా… ఆ కోర్టు ఆర్డర్లు ఏమిటో… కోర్టు తీర్పు ఏమిటో, మీరు ఫైల్ చేసిన పిటిషన్ ఏమిటో… అన్నింటి వివరాలను ఒక్కొక్కటిగా రేపటి నుంచి క్రైమ్ మిర్రర్ దినపత్రికలో పూర్తిగా విశ్లేషణాత్మక కథనాలను ప్రచురిస్తాం. మీ బండారాన్ని పూర్తిగా ప్రజల ముందు బయట పెడతాం. “
ఎడిటర్
క్రైమ్ మిర్రర్ దినపత్రిక
హైదరాబాద్
ఇవి కూడా చదవండి …
- రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సీనియర్ నేత..
- మైనర్లతో మద్యం రవాణా… ఆన్‌లైన్ బుకింగ్ బాయ్స్‌గా మారిన చిన్నారులు
- కాంగ్రెస్ కూటమితోనే కేసీఆర్.. తెలంగాణలోనూ కలిసిపోతారా?
- శ్మశాన వాటికలో సమాధిపై ఓమహిళా తహసీల్దార్ ఫోటోతో క్షుద్రపూజలు
- క్లాస్ రూమ్ లో ప్రిన్సిపాల్ ను కొట్టిన ఎమ్మెల్యే..
One Comment