
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సొంత పార్టీ నేతే ఆయన ఝలక్ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చారు. సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ ఘన స్వాగతం పలికింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు స్వాగతం చెప్పారు. తెలంగాణ మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. తర్వాత బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జలవిహార్ వరకు టీఆర్ఎస్ పార్టీ భారీ బైక్, కారు ర్యాలీ నిర్వహించింది.
Read More : తెలంగాణలో 9 లక్షల కోట్ల అవినీతి? సీబీఐ ఉచ్చులో సీఎం కేసీఆర్?
యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తోంది. ఆయన నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.కాని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం యశ్వంత్ సిన్హాకు సంబంధించి శనివారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వస్తున్న యశ్వంత్ సిన్హాను కలవబోమని చెప్పారు. ఈ గోడమీద వాలిన కాకి ఆ గోడ మీద వాలదూ అంటూ పరోక్షంగా టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్న సిన్హాతో తాము కలిసేది లేదని చెప్పారు. పార్టీ నేతలకు కూడా అవే ఆదేశాలు ఇచ్చారు.రేవంత్ రెడ్డి ప్రకటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన యశ్వంత్ సిన్హాను కలవొద్దని రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటన్న ప్రశ్నలు వచ్చాయి.
Read More : భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యేగా గంగిడి!
అయితే హైదరాబాద్ కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ స్వాగత కార్యక్రమంలో ఆసక్తికర ఘటన జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లవద్దని ఆదేశాలు ఇచ్చినా ఓ కాంగ్రెస్ సీనియర్ నేత బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చి యశ్వంత్ సిన్హాకు స్వాగతం తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఎయిర్ పోర్టుకు రావడమే కాదు.. సీఎం కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హాను కలిశారు. ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. రేవంత్ రెడ్డి ఆదేశాలను పట్టించుకోకుండా వీహెచ్ రావడంతో రేవంత్ రెడ్డికి షాక్ తగిలిందనే చర్చ సాగుతోంది.యశ్వంత్ సిన్హా పర్యటనకు సంబంధించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యశ్వంత్ సిన్హాను సీఎల్పీ నుంచి ఆహ్వానిస్తే బాగుండేదన్నారు. ఈ విషయంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు జగ్గారెడ్డి లేఖ రాశారు. యశ్వంత్ సిన్హా తమ అభ్యర్థి కాదంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు జగ్గారెడ్డి.
ఇవి కూడా చదవండి …
- ఈటల రాజేందర్ మరో ఏక్ నాథ్ షిండేనా? కేసీఆర్ ముందే గ్రహించి అప్రమత్తమయ్యారా?
- ప్రధాని మోడీ ముందు టీఆర్ఎస్ బలప్రదర్శన.. హైదరాబాద్ లో హై టెన్షన్
- గవర్నర్ తో జోకులు.. కిషన్ రెడ్డితో నవ్వులు! బీజేపీని షాక్ ఇచ్చిన కేసీఆర్..
- చేరికలతో పెరిగిన వర్గ పోరు.. రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుర్రు
- మునుగోడు టీఆర్ఎస్ టికెట్ బీసీకే! పీకే సర్వేలో నారబోయినే టాప్?
One Comment