
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఓ పక్క బీజేపీ కార్యవర్గ సమావేశాలు..మరో పక్క విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో పాలిటిక్స్ మారిపోయాయి. యశ్వంత్ సిన్హాను టీఆర్ఎస్ ఘనంగా స్వాగతం పలికింది. ఆయన కోసం జలవిహార్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ టార్గెట్‌గా పలు ప్రశ్నలు సంధించారు.
Read More : కాంగ్రెస్ కూటమితోనే కేసీఆర్.. తెలంగాణలోనూ కలిసిపోతారా?
రెండురోజులపాటు హైదరాబాద్‌లో ప్రధాని మోదీ ఉండబోతున్నారని..బహిరంగసభలో తమపై మరోసారి విమర్శలు చేయబోతున్నారని తెలిపారు. అంతకంటే ముందు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. రైతులు మీకు ఉగ్రవాదులగా..వేర్పాటు వాదులగా కనిపిస్తున్నారా అని మండిపడ్డారు. ఎన్నికలప్పుడే మోదీకి ప్రజలు గుర్తుకు వస్తారని విమర్శించారు.
Also Read : తెలంగాణలో 9 లక్షల కోట్ల అవినీతి? సీబీఐ ఉచ్చులో సీఎం కేసీఆర్?
మోదీ తనకు తాను మేధావిగా భావిస్తున్నారని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీజేపీ పాలనలో ఎరువులు, నిత్యావసర ధరలు భారీగా పెరిగాయని గుర్తు చేశారు. రైతు చట్టాలు సరైనవే అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మోదీ ప్రధానిలా కాకుండా సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి …
- భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన భారీగా పోలీసు ఆంక్షలు
- ఈటల రాజేందర్ మరో ఏక్ నాథ్ షిండేనా? కేసీఆర్ ముందే గ్రహించి అప్రమత్తమయ్యారా?
- చెరువులో దూకి తొమ్మిదో తరగతి ప్రేమికుల ఆత్మహత్య
- ప్రధాని మోడీ ముందు టీఆర్ఎస్ బలప్రదర్శన.. హైదరాబాద్ లో హై టెన్షన్
- చక్కని జీవితం..కానీ.. భార్య ఏమిచేసిందంటే?
One Comment