
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రేమ వద్దని తల్లిదండ్రులు మందలించినందుకు మైనర్ బాలుడు, బాలిక చెరువులో దూకి అత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం దర్గయ్య, లలిత దంపతులు. కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్‌లో ఉంటున్నారు. వీరి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో శివ , ఇందిర దంపతుల కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఒకే తరగతి కావడంతో వీరిద్దరూ స్నేహంగా వుండేవారు. ఈ స్నేహం మరింత బలపడి ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. తెలిసీతెలియని వయసులో కలిగిన ఈ ఆకర్షణనే ప్రేమగా భావించారు. కొంతకాలం ఈ మైనర్ల ప్రేమ సాగినా ఎలాగో ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసింది. బాలికను తీవ్రంగా మందలించి స్కూల్ మాన్పించిన తల్లిదండ్రులు ఇంటివద్దే ఉంచుతున్నారు. దీంతో బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది.
Read More : అయ్యో ఎంత పని చేసారు.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
ఇక ప్రేమించిన యువకుడిని కలవాలని మైనర్ బాలిక భావించింది. ఇలా అదునుకోసం ఎదురుచూస్తున్న బాలికను దగ్గర్లోని అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేసే తండ్రికి టిఫిన్ బాక్స్ ఇచ్చి రావాల్సిందిగా తల్లి పంపింది. ఇదే అదునుగా ప్రేమించిన బాలుడిని కలవడానికి బాలిక సిద్దమయ్యింది. మొదట తండ్రికి టిఫిన్ బాక్స్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్లకుండా బాలుడిని కలిసేందుకు వెళ్లింది. చాలారోజుల తర్వాత కలుసుకున్న ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదు కాబట్టి కలిసి జీవితం ముగిద్దాం అనుకున్నారు. మధ్యాహ్నం సైకిల్ పై ఇద్దరూ కలిసివెళుతూ ఓ స్నేహితుడికి స్కూల్ బ్యాగ్ ఇచ్చాడు. అక్కడినుండి జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు వద్దకు వెళ్ళారు. సైకిల్ అక్కడే పెట్టి, చెప్పులు వదిలి చెరువులో దూకారు.
ఇవి కూడా చదవండి …
- ప్రధాని మోడీ ముందు టీఆర్ఎస్ బలప్రదర్శన.. హైదరాబాద్ లో హై టెన్షన్
- చక్కని జీవితం..కానీ.. భార్య ఏమిచేసిందంటే?
- మంచి బ్రాండ్లు కావాలని నినాదిద్దాం.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు
- ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్త్ ఏర్పాట్లు..
- టెన్త్ ఫలితాల్లో బాలికల హవా.. సిద్దిపేట జిల్లా టాప్