
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అందమైన జీవితం ఉన్నవాళ్లు కూడా ఎదో తెలియని ఆనందం కోసం పరుగులు పెడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వందేళ్ల భవిష్యత్తుకంటే తాత్కాలిక సుఖాల వెంట పరుగులు పెడుతూ కటకటాల్లోకి వెళ్తున్నారు. భర్త ప్రభుత్వ ఉద్యోగి.. మంచి జీతం, చక్కని జీవితం అన్నీ పక్కనబెట్టిన ఓ ప్రబుద్ధురాలు పక్కదారి పట్టింది. అక్కడితో ఆగిందా.. తన సుఖంకోసం కట్టుకున్నవాడిని అన్యాయంగా పొట్టనబెట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన షేక్ జవహర్ హుసేన్ బనగానపల్లె మండలం చెరువుపల్లెలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. అతికి భార్య షేక్ హసీనా, కొడుకు తమీమ్, కూతురు ఆర్పియా ఉన్నారు.
Read More : మంచి బ్రాండ్లు కావాలని నినాదిద్దాం.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఐతే కొంతకాలంగా హసీనాకు అదే ప్రాంతానికి చెందిన మహబూబ్ బాషా అనే వ్యక్తితో వివైహేతర సంబంధం ఉంది. ఇది తెలిసిన జవహర్ హుస్సేన్.. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి భార్యను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అనంతరం మహబూబ్ బాషాను గ్రామం నుంచి పంపేశారు. ఇంత జరిగినా హసీనాలో మార్పు రాలేదు. ప్రియుడు మహబూబ్‌బాషతో ఫోన్లో మాట్లాడుతుండేది. ఇది గమనించిన జవహర్.. భార్యను వేధించేవాడు. దీంతో ప్రియుడితో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. వెంటనే ప్రియుడు మహబూబ్ భాషాతో పాటు తమ్ముడు ఇద్రూస్ కు చెప్పి హత్యకు కుట్రపన్నింది. దీంతో ఈనెల 13న హత్యకు స్కెచ్ వేసింది హసీనా.. ముందుగా ఇద్దరు పిల్లలను తన తల్లి ఇంటికి పంపింది.
Read More : ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్త్ ఏర్పాట్లు..
అదేరోజు రాత్రి మద్దూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జవహర్ హుస్సేన్ రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చి నిద్రపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన మహబూబ్, ఇద్రూస్.. తాడుతో జవహర్ గొంతుకు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా చేసేందుకు జవహర్ కు ఆస్తమా ఉందని.. ఊపిరాడకపోవడంతో పలకడం లేదని బంధువులకు సమాచారం ఇచ్చి హడావిడి చేశారు. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఐతే ఆస్తమా మందులు సక్రమంగా వాడుతున్నందున చనిపోయే అవకాశం లేదని.. తన అన్న చావుకు మరైదేనా కారణముందని జవహర్ తమ్ముడు కరీముల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోస్ట్ మార్టం చేయించి నివేదికను పరిశీలించగా హత్యగా తేలింది. భార్యే ప్రియుడుతో కలిసి హత్యకు పాల్పడినట్లు విచారణలో తేల్చిన పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి …
- అయ్యో ఎంత పని చేసారు.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
- శ్మశాన వాటికలో సమాధిపై ఓమహిళా తహసీల్దార్ ఫోటోతో క్షుద్రపూజలు
- హైదరాబాద్‌లో మరో దారుణం.. మైనర్ బాలికపై యువకుడి రేప్..
- భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యేగా గంగిడి!
- మరో పరువు హత్య.. బేగంబజార్ లో వెంటాడి చంపిన దుండగులు
3 Comments