
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్రలో కొన్ని రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది. అందరని అంచనాలు తలకిందులు చేస్తూ శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్ర ఎపిసోడ్ తర్వాత మరికొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయనే చర్చలు సాగుతున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణపై ఫోకస్ చేసింది బీజేపీ. దీంతో తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా పరిణామాలు జరుగుతాయా అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read More : ప్రధాని మోడీ ముందు టీఆర్ఎస్ బలప్రదర్శన.. హైదరాబాద్ లో హై టెన్షన్
తెలంగాణలోనూ త్వరలో మహారాష్ట్ర మాదిరిగానే పరిణామాలు జరుగుతాయంటూ హాట్ కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. పరేగ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మాట్లాడిన కిషన్ రెడ్డి.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా తెలంగాణ బీజేపీ అధికారంలోకి రాకుండా ఆపడం ఎవరి తరం కాదన్నారు. కేసీఆర్ పతనం మొదలైందన్నారు కిషన్ రెడ్డి. పుత్ర వ్యాత్సల్యం వల్లే మహారాష్ట్రలో శివసేన చీలి పోయిందని అన్నారు. పుత్రుడికి పట్టాభిషేకం చేయాలిన చూస్తున్న కేసీఆర్ కు ఉద్దవ్ థాకరేకు పట్టిన గతే పడుతుందన్నారు. మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో సంచలనం జరగబోతోందంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
Read More : కేసీఆర్ పై గెలిచిన ఇద్దరు మొనగాళ్లు…
తిరుగుబాటు చేసిన శివసేన నేత ఏకనాథ్ షిండే.. ఉద్దవ్ థాకరేపై సంచలన ఆరోపణలు చేశారు. శివసేన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ దొరకడమే కష్టమైందన్నారు. దీనిపై మాట్లాడాలని తాను ప్రయత్నించినా ఉద్దవ్ సమయం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వంతో పార్టీలో నిర్ణయాలన్ని ఆదిత్య థాకరే డైరెక్షన్ లోనే జరిగాయన్నారు. రెండేళ్లుగా భరించిన ఎమ్మెల్యే సహనం నశించే తిరుగుబాటు చేశారన్నారు. తెలంగాణలో నూ సీఎం కేసీఆర్ తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనే టాక్ వస్తోంది. ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ప్రగతి భవన్ లోకి ఎంట్రీ కావడమే ఎమ్మెల్యేలకు కష్టమనే వాదన ఉంది. మంత్రులు కూడా ప్రగతి భవన్ వరకు వెళ్లి అనుమతి లేక వెనుదిరిగి వస్తున్న పరిస్థితులు ఉన్నాయంటున్నారు. దీంతో మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణలో పరిణామాలు రావొచ్చనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త కొత్త చర్చ తెరపైకి వస్తోంది.
Read More : మంచి బ్రాండ్లు కావాలని నినాదిద్దాం.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు
కిషన్ రెడ్డి చెప్పినట్లు మహారాష్ట్ర తరహా పరిణామాలు జరిగితే.. తెలంగాణలో ఏక్ నాథ్ షిండే ఎవరు అన్నదే ప్రశ్నగా మారింది. గత ఏడాది మంత్రివర్గం నుంచి అవినీతి ఆరోపణలతో ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో గ్రూప్ గా ఏర్పడే ప్రయత్నం చేసినందునే ఈటలను కేసీఆర్ పంపించి వేశారని.. అవినీతి ఆరోపణలు ఒక సాకు మాత్రమేననే టాక్ వచ్చింది. 2018 ఎన్నికల సమయంలోనే కేసీఆర్ పై ఈటల కుట్రలు చేశారని కొందరు గులాబీ నేతలు ఓపెన్ గానే చెప్పారు. ఈటల మరికొన్ని రోజులు టీఆర్ఎస్ లో ఉంటే ఏక్ నాథ్ షిండేలా తిరుగుబాటు చేసే అవకాశం ఉండేదని.. ఈ విషయాన్ని గ్రహించిన కేసీఆర్ ముందే అప్రమత్తమై.. ఈటలను ఇంటికి పంపించారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- చెరువులో దూకి తొమ్మిదో తరగతి ప్రేమికుల ఆత్మహత్య
- ఇకపై టీచర్లు ఆస్తుల విలువ చెప్పాల్సిందే..తెలంగాణ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!
- బతిమాలిడినా బీజేపీని పట్టించుకోని నేతలు.. రేవంత్ రెడ్డి దెబ్బ మాములుగా లేదుగా!
- శ్మశాన వాటికలో సమాధిపై ఓమహిళా తహసీల్దార్ ఫోటోతో క్షుద్రపూజలు
- నైతిక విలువలు లేని బజారు నేత కేసీఆర్- రేవంత్ రెడ్డి..