
క్రైమ్ మిర్రర్, అమరావతి : శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది అందులోనే సజీవదహనమయ్యారు. మృతులను గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. ఉదయాన్నే వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read : తల్లి కాబోతున్న సింగర్ సునీత… ఇన్ డైరెక్టుగా చెప్పారా?
హైటెన్షన్ విద్యుత్ తీగలు కింద పడిపోతుండటాన్ని గమనించకుండా ఆటో డ్రైవర్ ముందుకు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో విద్యుత్ వైర్లు ఆటోపై పడి ఒక్కసారి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల ధాటికి అందులోని ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఇప్పటివరకూ ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. ప్రమాద విషయం తెలిసి స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.ప్రమాద ఘటనపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యానారయణ, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పరిటాల శ్రీరామ్ ప్రభుత్వాన్ని కోరారు.
Also Read : వైసీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్. కృష్ణయ్యపై నాన్‌బెయిలబుల్ కేసు
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకున్న విషాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలీల మృతి విచారకరమని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా రాజ్‌భవన్ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియాను ఆదేశించారు.ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఇవి కూడా చదవండి …
- మన్యంలో మరో నయీం ‘అనంత’ రూపాలు.. తన ఆదేశాలే ప్రైవేటు చట్టాలు..
- మూడు నెలల్లో దేశంలో సంచలనం.. జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యమన్న కేసీఆర్
- అధికార పార్టీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం.. కొట్టి చంపారనే ఆరోపణలు
- టెన్త్ ఫలితాల్లో బాలికల హవా.. సిద్దిపేట జిల్లా టాప్
- గవర్నర్ తో జోకులు.. కిషన్ రెడ్డితో నవ్వులు! బీజేపీని షాక్ ఇచ్చిన కేసీఆర్..
One Comment