
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లారు. దాదాపు తొమ్మిది నెలలుగా రాజ్ భవన్ ముఖం చూడలేదు కేసీఆర్. గవర్నర్ తమిళి సై తీరుపై గుర్రుగా ఉన్న కేసీఆర్ అటు వైపు వెళ్లలేదు. అటు గవర్నర్ తమిళి సై కూడా కేసీఆర్ సర్కార్ తనను అవమానిస్తోందని ఓపెన్ గానే చెప్పారు. కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు. గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ భారీగా పెరిగిపోయిన సమయంలో కేసీఆర్ రాజ్ భవన్ వెళ్లడం బ్రేకింగ్ న్యూస్ గా మారింది.
Also Read : తెలంగాణలో 9 లక్షల కోట్ల అవినీతి? సీబీఐ ఉచ్చులో సీఎం కేసీఆర్?
హైకోర్టు కొత్త సీజే ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్ భవన్ వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ హడావుడి చేశారు. కొంత కాలంగా గవర్నర్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడని కేసీఆర్.. రాజ్ భవన్ లో సరదాగా గడిపారని తెలుస్తోంది. తనకు ప్రత్యర్థిగా చూసిన గవర్నర్ తమిళి సైతో ఆత్మీయంగా మాట్లాడారు. గవర్నర్ ఇచ్చిన తేనిటి విందులో పాల్గొన్నకేసీఆర్ జోకులు కూడా వేశారని.. ఆయన వేసిన జోకులకు గవర్నర్ పగలబడి నవ్వారని తెలుస్తోంది. రాజ్ భవన్ విడుదల చేసిన ఫోటోల్లోనూ కేసీఆర్, తమిళి సై సరదాగా మాట్లాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇద్దరి ముఖాల్లోనూ చాలా సంతోషం కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత కలిసినందుకో ఏమో కేసీఆర్, గవర్నర్ ఎమోషనల్ అయ్యారని చెబుతున్నారు.
Also Read : క్లాస్ రూమ్ లో ప్రిన్సిపాల్ ను కొట్టిన ఎమ్మెల్యే..
ఇటీవల కాలంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఓ రేంజ్ లో ఫైటింగ్ జరుగుతోంది. పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత దూషణలతో కాక రేపుతున్నారు. కేసీఆర్ టార్గెట్ గా ఏకంగా బీజేపీ కార్యాలయం ముందు బోర్డు పెట్టారు కమలనాధులు. సాలు దొర.. సెలవు దొర పేరుతో క్రియేట్ చేసిన వెబ్ సైట్ దుమారం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ భవన్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం కేసీఆర్ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. సీజే ప్రమణస్వీకారం తర్వాత గవర్నర్ తేనేటి విందు సందర్భంగా కిషన్ రెడ్డి, కేసీఆర్ చాలా సేపు మాట్లాడుకున్నారు. గుసగుసలు కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్, కేసీఆర్ జోకులు వేసుకుంటుండగా కిషన్ రెడ్డితో వాళ్లతో కలిసి నవ్వుతున్న వీడియోలు బయటికి వచ్చాయి. రాజ్ భవన్ లో జరిగిన పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారాయి.
ఇవి కూడా చదవండి …
- చినజీయర్ పై కేసు… కేసీఆర్ కసి తీర్చుకుంటున్నారా?
- జూన్ 28న టీహబ్ ప్రారంభోత్సవం.. మోడీ టూర్ కు ముందు కేసీఆర్ ప్లాన్
- మునుగోడు టీఆర్ఎస్ టికెట్ బీసీకే! పీకే సర్వేలో నారబోయినే టాప్?
- చేరికలతో పెరిగిన వర్గ పోరు.. రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుర్రు
- ఇకపై టీచర్లు ఆస్తుల విలువ చెప్పాల్సిందే..తెలంగాణ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!