
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చినజీయర్ స్వామితో మంచి సంబంధాలు ఉండేవి. చినజీయర్ సూచనస ప్రకారమే కేసీఆర్ ముందుకు సాగేవారు. అయితే ఇటీవల కాలంలో చినజీయర్ తో కేసీఆర్ కు విభేదాలు వచ్చాయనే ప్రచారం సాగుతోంది. ముచ్చింతల్ లో నిర్మించిన శ్రీరామ నగరం, సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ రాగా.. సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. శిలాఫలకంలో కేసీఆర్ పేరు పెట్టకపోవడంతో ఆయన చినజీయర్ పై ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ తర్వాత కేసీఆర్, చినజీయర్ ఇప్పటివరకు కలవలేదు. అయితే ఒకప్పుడు చినజీయర్ పై ఈగ వాలనీయని కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఏకంగా కేసులు పెట్టేవరకూ వెళ్లడం సంచలనంగా మారింది.
Also Read : చినజీయర్ పై కసి తీర్చుకున్న కేసీఆర్!
‘స్ట్రాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహం పెట్టి వందల ఎకరాల్లో చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సమాతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు పలువురు భక్తులు ఇక్కడికి తరలివస్తున్నారు. మొదట్లో ఉచితంగానే ప్రవేశం కల్పించిన నిర్వాహకులు ఆ తరువాత చార్జ్ తీసుకుంటున్నారు.అయితే డబ్బులు పెట్టి మరీ లోపలికి వస్తున్నా.. తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని కొందరు ఇప్పటికే ఆరోపణలు చేశారు. తాజాగా ఓ భక్తుడు తమకు ఇచ్చే ప్రసాదం.. నాణ్యమైనది కాకపోవడంతో పాటు ఇందులో అవకతవకలున్నాయని తూనికలు కొలతల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.
Also Read : టీవీ9లో కనిపించని యాదాద్రి… త్వరలో కేసీఆర్ బ్యాన్?
వినయ్ వంగాల అనే వ్యక్తి సమతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు వచ్చారు. విగ్రహ దర్శనం అనంతరం అక్కడ విక్రయించే ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ ప్రసాదం కవర్ పై కాలపరిమితి ముద్రించలేదు. అంతేకాకుండా కవర్ పై ఉన్న బరువుకు.. లోపలున్న ప్రసాదం బరువుకు తేడా అనిపించింది. దీంతో అక్కడున్న సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పారు. వారు స్పందించలేదు. వెంటనే ఆయన మెయిల్ ద్వారా తూనికలు కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు ఆశ్రమానికి వచ్చి తనిఖీ చేశారు.ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు చినజీయర్ ఆశ్రమానికి వచ్చారు. ఆ తరువాత ప్రసాదాన్ని తనిఖీ చేశారు. వినయ్ వంగాల ఫిర్యాదు నిజమేనని తేలడంతో మెట్రాలజీ యాక్ట్ 2009 101112 అండ్ 8/25 సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని వినయ్ మీడియాకు తెలిపారు.
Read More : ఈ సారి కేసీఆర్ నల్గొండ నుండే బరిలోకి..? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
సాధారణంగా ప్రతీ ఆలయంలో సూచించిన బరువు ప్రకారం లడ్డూ ఉండకపోవచ్చు. అయితే ఈ విషయాన్ని అటు ఆలయ అధికారులు ఇటు భక్తులు పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ భక్తుడు దీనీని పెద్ద ఇష్యూ చేయడం చర్చనీయాంశంగా మారింది.అదీ గాక ఒక భక్తుడు చేసిన ఫిర్యాదును తూనికలు కొలతల అధికారులు ఇంత సీరియస్ గా తీసుకోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సమతామూర్తి ఆశ్రమంలోని లోపాలను ఎత్తి చూపేందుకే వినయ్ వచ్చాడా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వినయ్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- జూన్ 28న టీహబ్ ప్రారంభోత్సవం.. మోడీ టూర్ కు ముందు కేసీఆర్ ప్లాన్
- మునుగోడు టీఆర్ఎస్ టికెట్ బీసీకే! పీకే సర్వేలో నారబోయినే టాప్?
- చేరికలతో పెరిగిన వర్గ పోరు.. రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుర్రు
- ఇకపై టీచర్లు ఆస్తుల విలువ చెప్పాల్సిందే..తెలంగాణ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!
- బతిమాలిడినా బీజేపీని పట్టించుకోని నేతలు.. రేవంత్ రెడ్డి దెబ్బ మాములుగా లేదుగా!