
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిది : తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారంలో విపక్షాలు దూకుడు పెంచాయి. సీఎం కేసీఆర్ కూడా ప్రగతి భవన్ నుంచి బయటికి రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారు. పీకే టీమ్ తెలంగాణలో పర్యటిస్తూ సర్వే నిర్వహిస్తోంది. పీకే టీమ్ సర్వేలో వస్తున్న ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ క్లారిటీకి వస్తున్నారని తెలుస్తోంది. పీకే టీమ్ సర్వేలో సిట్టింగు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందట. విపక్షాలు గెలిచిన చోట టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ లుగా ఉన్న నేతలపైనా జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని తెలుస్తోంది.
Read More : కూసుకుంట్ల అండతో అనుచరుల అక్రమాలు.. ప్రశ్నించిన సొంత పార్టీ సర్పంచ్ పైనే కేసు!
సీఎం కేసీఆర్ కోసం పీకే టీమ్ నిర్వహించిన సర్వే ఫలితాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సంచలన ఫలితాలు వచ్చాయంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఇంచార్జ్ లపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందట.దీంతో నల్గొండ జిల్లాలో మెజార్టీ అభ్యర్థులను మార్చాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. జిల్లా ప్రజల నాడిని పసిగట్టిన పీకే టీమ్… బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిందట. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని… ఒక్కటైనా ఖచ్చితంగా ఇవ్వాలని రిపోర్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో పీకే టీమ్ సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని చెబుతున్నారు. నల్గొండ ఎంపీ పరిధిలో నాగార్జున సాగర్, కోదాడలో ప్రస్తుతం బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ సారి కూడా ఆ సీట్లు బీసీలకే ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తే సూర్యాపేట అసెంబ్లీ సీటు బీసీకి ఇవ్వాలనే యోచనలో గులాబీ బాస్ ఉన్నారని అంటున్నారు.
Read More : కూసుకుంట్లను తరిమికొడతామంటున్న జనం.. అసలేం జరిగింది?
ఇక భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఐదు జనరల్ సీట్లు ఉండగా.. ఐదు నియోజకవర్గాలైన జనగాం, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మునుగోడులో రెడ్డే ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో భువనగిరి పరిధిలో మునుగోడును ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలని పీకే టీమ్ సూచించిందని తెలుస్తోంది .మునుగోడులో బీసీ ఓటర్లు భారీగా ఉన్నా ఇప్పటివరకు బీసీ ఎమ్మెల్యే కాలేదు. ఈ నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉందని సర్వేలో తేలిందట. దీంతో మునుగోడు నుంచి బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని దాదాపుగా డిసైడ్ అయిన కేసీఆర్.. పీకీ టీమ్ ద్వారా బీసీ అభ్యర్థి కోసం ప్రత్యేక సర్వే చేయించారని తెలుస్తోంది. మునుగోడు నుంచి టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బీసీ వర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మునుగోడు జడ్పీటీసీ భర్త నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ రేసులో ఉన్నారు. అయితే విద్యాసాగర్ కు నియోజకవర్గంలో పెద్దగా సంబంధాలు లేవు. ఆయన హైదరాబాద్ లోనే ఎక్కువ రాజకీయం చేస్తుంటారు. ఇక పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కర్నె ప్రభాకర్ ను శాసనమండలి లేదా రాజ్యసభకు పంపించాలనే కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.
Also Read : మునుగోడుకు నేతల తాకిడి… పోటాపోటీగా సాయం! అంతా ఎన్నికల మహిమ?
పీకే టీమ్ సర్వేలో మునుగోడులో నారబోయిన రవికి మంచి మార్కులు వచ్చాయని తెలుస్తోంది. యువకుడు కావడం, నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఆయనకు ప్లస్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు టీఆర్ఎస్ లో ఈటల రాజేందర్ తర్వాత ఆయన సామాజిక వర్గం నుంచి మరో నేత లేరు. బండా ప్రకాశ్ ఉన్నా ఆయన ప్రత్యక ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో నారబోయిన రవి ముదిరాజ్ కు టికెట్ ఇస్తే ఆ వర్గానికి కూడా ప్రాతినిద్యం ఇచ్చినట్లవుతుందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నారని తెలుస్తోంది. నారబోయిన రవి ఆర్థికంగానూ బలంగా ఉండటంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన అనుచర వర్గాన్ని కలిగియున్నారు. బీసీ వర్గాల్లోనూ ఆయనకు పట్టు ఉంది. అన్ని అనుకూలంగా ఉండటంతో మునుగోడు టికెట్ ను నారబోయినకు ఇస్తే బాగుటుందని కేసీఆర్ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. నారబోయినకు మంత్రి జగదీశ్ రెడ్డి అండదండలు పూర్తిగా ఉన్నాయంటున్నారు. టికెట్ ఖాయమని మంత్రి సిగ్నల్ ఇవ్వడం వల్లే కొన్ని రోజులుగా నారబోయిన నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారనే టాక్ వస్తోంది.
ఇవి కూడా చదవండి …
- జూన్ 28న టీహబ్ ప్రారంభోత్సవం.. మోడీ టూర్ కు ముందు కేసీఆర్ ప్లాన్
- చేరికలతో పెరిగిన వర్గ పోరు.. రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుర్రు
- ఇకపై టీచర్లు ఆస్తుల విలువ చెప్పాల్సిందే..తెలంగాణ విద్యా శాఖ కీలక ఉత్తర్వులు..!
- బతిమాలిడినా బీజేపీని పట్టించుకోని నేతలు.. రేవంత్ రెడ్డి దెబ్బ మాములుగా లేదుగా!
- మైనర్లతో మద్యం రవాణా… ఆన్‌లైన్ బుకింగ్ బాయ్స్‌గా మారిన చిన్నారులు
One Comment