
- డబ్బులకు ఆశపడి మద్యం సప్లయ్ చేస్తున్న మైనర్లు
- అడిగే నాధుడు లేడు, అధికారులకు సోయిలేదు
- అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): కోడలికి బుద్ధి చెప్పి అత్త ఇంకొకడితో వెళ్లినట్లు ఉంది వైన్స్ నిర్వాహకుల పనితనం. ఎలాగైనా సరే బ్యాంకు ఖాతాలో డబ్బు జమ కావాలనే చూస్తున్నారు తప్ప… సమాజం గురించి ఏమాత్రం పట్టింపు లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు మద్యం షాపుల యజమానులు. చిన్నారులను మద్యానికి దూరంగా ఉంచాలన్న ఆలోచనతో ప్రభుత్వం 21 ఏళ్లు పైబడినవారికే మద్యం విక్రయించాలని నిబంధనలు పెట్టినప్పటికీకి….ఇవేమీ పట్టనట్లు… లూటీ పోయిన తోటలా ఇష్టారీతిలో మద్యం అమ్మకాలు సాగిస్తూ… ఆదాయమే రాబడే పరమావధిగా ఎంతటి దుస్సాహసానికైనా వైన్స్ ఓనర్స్ ఒడిగడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
Read More : బయటికొస్తున్న మర్రిగూడ మద్యం మాఫియా లీలలు..
నల్లగొండ జిల్లా మర్రిగూడలోని వైన్స్‌లలో చిన్నపిల్లలతో మద్యం సరఫరా చేయించడం రోజూవారీ కార్యక్రమంగా మారింది. సరిగ్గా 18 సంవత్సరాలు నిండని మైనర్లతో వైన్స్ నిర్వాహకులే ఫోన్ ల ద్వారా మద్యం సరఫరా చేపిస్తున్నారనేది మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకులకు, ప్రముఖులకు ఫోన్ కాల్ రాగానే కావాల్సిన సరుకును ఇంటికి పంపుతున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. నకిలీ మద్యం తయారు చేయడమే కాకుండా చిన్న పిల్లలతో కూడా మద్యం సరఫరా చేయించటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దందా గత కొన్ని రోజులుగా సాగుతున్నా అధికారులు ఆమ్యామ్యాలకు లొంగి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్న పిల్లలు సైతం మత్తుకు బానిసలై దొంగతనాలకు, ఇతర చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : మిర్యాలగూడకు జానా.. మునుగోడు స్రవంతి! నల్గొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు?
మైనర్లు గేటు దాటి రావటం ఏంటి, అంతా తెలిసి అందరూ చూస్తుండగా కవర్‌లో పెట్టి మద్యం పంపటం వెనుక పలు అనుమానాలకు తావుతీస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. అవగాహన లేని వయసులో మద్యం సరఫరా చేయించటమే కాక, ద్విచక్ర వాహనాలను ఇచ్చి పంపుతున్నారన్నట్లు తెలుస్తోంది. బైక్‌లపై ఇద్దరు ముగ్గురు ప్రయాణిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని, ఈ ప్రమాధాలకు ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా నాకేం సంబంధం లేదనే విధంగా ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
Read More : మందుబాబులు పండగ చేస్కోండి.. భారీగా తగ్గనున్న లిక్కర్ ధరలు!
నెల సరి మామూళ్ల ఆశపడి విధుల నిర్వహణ మరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలతో వాహనాలు నడిపిస్తూ, మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్న సదరు వైన్ షాపు నిర్వాహకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మైనర్లకు ఏదైనా జరగరానిది జరిగితే ఎక్సైజ్ శాఖ, పోలీస్ అధికారులే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- అయ్యో ఎంత పని చేసారు.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
- చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి
- కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ లీడర్
- టీఆర్ఎస్ నేత దారుణ హత్య… తల, మొండెం వేరు చేసిన కిరాతకులు
- మన్యంలో మరో నయీం ‘అనంత’ రూపాలు.. తన ఆదేశాలే ప్రైవేటు చట్టాలు..
One Comment