
రెండేళ్లు దాటినా కొవిడ్ మహమ్మారి తగ్గడం లేదు. కొత్త వేవ్ లు వస్తూ విలయ తాండవం చేస్తున్నాయి. కొవిడ్ మూడో వేవ్ తర్వాత ఇప్పుడు మరో కొత్త వేవ్ పుట్టుకొచ్చింది. శర వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొవిడ్ కొత్త వేవ్ తో యూరప్ దేశాలు అల్లాడిపోతున్నాయి. కొత్త వైరస్ గతంలో కంటే పదిరెట్లు వేగంగా వ్యాపిస్తోంది. ఫ్రాన్స్ లో కొవిడ్ కొత్త వేవ్ విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే ఆ దేశంలో 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఫ్రాన్స్ దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్క్ ధరించాలని సూచించారు ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ చెప్పారు.ప్రజా రవాణాలో మాస్క్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
ఫ్రాన్స్ లో గత నెల చివరి వారం నుంచి కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఏడు రోజుల వ్యవధిలోనే రోజువారీ కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగాయి. గత నెల 27న 17705 కేసులు నమోదయ్యాయి. తాజాగా 50402మందిలో వైరస్ బయటపడింది. ఇటు పక్కనున్న పోర్చుగల్ దేశంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ రూపాంతరం చెంది బీఏ4 బీఏ5గా మారి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు ఫ్రాన్స్ అధికారులు చెబుతున్నారు.దీనివల్లే కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. అక్కడి శాస్త్రవేత్తలు వైద్యులు ఇప్పుడు కొత్త వేరియంట్లపై పరిశోధన జరుపుతున్నారు. వైరస్ బారిన పడిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని.. దీర్ఘకాలిక రోగాలున్న వారికి మాత్రమే డేంజర్ గా ఉందని వారు చెబుతున్నారు.
ఇప్పటికే బ్రిటన్ లోనూ కొత్త కరోనా వేరియంట్లను కనుగొన్నారు.. ‘ఎక్స్.ఈ’ అనే ఒమిక్రాన్ కొత్త కోవిడ్ సబ్ వేరియంట్ పంజా విసురింది.. ఒమిక్రాన్ బీఏ2 సబ్ వేరియంట్ కంటే 10శాతం అధికంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని హెచ్చరించింది.’ఎక్స్.ఈ’ కరోనా వేరియంట్ మొదటిసారిగా యూకేలో కొనుగొన్నారు. 600 కంటే ఎక్కువ ‘ఎక్స్.ఈ’ కేసులు నిర్ధారణ అయ్యాయి. యూకేలో జనవరి 19న ఈ ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి కనుగొన్నారు. 600 కంటే ఎక్కువ ‘ఎక్స్ ఈ’ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎక్స్ ఈ వంటి రీకాంబినెంట్ వేరియంట్ లకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ రిస్క్ ను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ తెలిపారు.
ఎక్స్.ఈ తీవ్రత వేగం వంటి లక్షణాలను గుర్తించబడే వరకూ ఇది ఒమిక్రాన్ వేరియంట్ లో భాగంగానే వర్గీకరిస్తామని డబ్ల్యూ.హెచ్.వో తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వీ1.1.529 బీఏ1బీఏ2 మరియు బీఏ3తో సహా నాలుగు వేరియంట్లను కలిగి ఉంటుందని తెలిపింది. ఇందులో బీఏ2 అని పిలవబడే స్టీల్త్ వెర్షన్ కూడా ఉంది. ఇది ఒమిక్రాన్ యొక్క ప్రారంభ కేసు తర్వాత కొంతమందికి మళ్లీ సోకినట్లు నమోదు చేయబడింది. ఇప్పుడు ఇదే వైరస్ సబ్ వేరియంట్ ఫ్రాన్స్ లో కల్లోలానికి కారణమవుతున్నట్టు తెలిసింది.