
క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి : తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డా ఇద్దరు మైనర్లు తమ కులాలు వేరు కావడంతో తమ ప్రేమను ఒప్పుకుని తమకు పెళ్లి చేస్తారో లేదోనని మనోవేదనకు గురై క్షణికావేశంతో రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం కడిచర్ల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం కడిచెర్ల గ్రామానికి చెందిన పల్లె పవన్ కుమార్ (18) అదేవిధంగా ధారూర్ మండలం ఎబ్బనూరు గ్రామానికి చెందిన అభినేయ (17) గుర్తిచమని చెప్పారు.
Also Read : భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యేగా గంగిడి!
వీరు ఇద్దరు పాఠశాలల్లో చదువుకునే సమయంలో పరిచయం ఏర్పడి అది చివరకు ప్రేమగా దారి తీసినట్లు తెలుస్తోంది.పవన్ కుమార్ కరోనా సమయంలో ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉండేవాడు. అభినేయ మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది.వీరు ఇరువురు తల్లిదండ్రులకు తెలియకుండా ఫోన్ లో మాట్లాడుకునే వారని వినికిడి. బుధవారం రోజు రాత్రి సుమారు 10 సమయం పవన్ కుమార్ తల్లిదండ్రులకు పైన పడుకుంటున్నాను చెప్పి వెళ్ళాడని తల్లిదండ్రులు తెలిపారు. అభినేయ మధ్యరాత్రి తల్లిదండ్రులకు చెప్పకుండా వారి ఫోన్లను కలగకుండా పెట్టి వెళ్లిపోయిందని గురువారం ఉదయాన్నే లేచి తమ కూతుర్ని చూడగా కనిపించకుండా పోవడంతో తెలిసిన వారిని అడిగి చివరకు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేద్దామని వెళ్లగా అ సమయంలో మాకు రైల్వే పోలీసులు సమాచారం అందించారని అభినేయ తల్లి చెప్పారు.
Also Read : నలుగురు పోలీస్ అధికారులకు 4 వారాల జైలు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
ఇద్దరూ కలిసి ముందే మాట్లాడుతున్న ఈ ప్రేమ జంట అనుకున్నట్టుగానే టిఎస్ 34 9258 గల ద్విచక్రవాహనంపై బయటకు వచ్చి అక్కడి నుంచి కడిచర్ల గ్రామ సమీపంలో గల రైల్వే పట్టాల వద్దకు చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య రైల్వే పోలీసులు తెలిపారు.ఇట్టి ఇద్దరి ఆత్మహత్యలపై వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి …
- చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి ..
- కొవిడ్ కొత్త వేవ్ విలయం.. రోజుకు 50వేల కేసులు.. మాస్క్ లేకుంటే గండమే..
- కాంగ్రెస్ కూటమితోనే కేసీఆర్.. తెలంగాణలోనూ కలిసిపోతారా?
- తెలంగాణలో 9 లక్షల కోట్ల అవినీతి? సీబీఐ ఉచ్చులో సీఎం కేసీఆర్?
- క్లాస్ రూమ్ లో ప్రిన్సిపాల్ ను కొట్టిన ఎమ్మెల్యే..
- శ్మశాన వాటికలో సమాధిపై ఓమహిళా తహసీల్దార్ ఫోటోతో క్షుద్రపూజలు
2 Comments