
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అతనో ఎమ్మెల్యే. గౌరవమైన పదవిలో ఉన్నా విచక్షణ మరిచారు. సమాజంలో ఉన్నతమైన గుర్తింపు ఉన్న అద్యాపకుడిపై దారుణంగా వ్యవహరించాడు. కాలేజీ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. క్లాస్ రూమ్ లో పిల్లలంతా చూస్తుండగానే.. ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్నారు ఎమ్మెల్యే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువుపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని డిమాండ్ అన్ని వర్గాల నుంచి వస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో జరిగింది. స్థానిక జనతాదళ్ జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాళాశాలకు వెళ్లారు. కాలేజీలో తనిఖీలు చేశారు. కాలేజీలో నిర్మాణంలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆరా తీశారు. పనుల పురోగతిపై కాలేజీ ప్రిన్సిపాల్ ను అడిగారు ఎమ్మెల్యే. అయితే వెంటనే ప్రిన్సిపాల్ సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. తాను అడిగిన వివరాలు ఇవ్వలేదంటూ మండిపడ్డారు. ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. ప్రిన్సిపాల్ చెంప చెల్లుమనిపించారు. ఒక్కసారి కాదు నాలుగు సార్లు కొట్టారు ఎమ్మెల్యే శ్రీనివాస్.
Read More : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా పవార్! జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న కేసీఆర్
ప్రిన్సిపాల్ పై ఎమ్మెల్యే దాడి చేసిన సమయంలో కాలేజీ సిబ్బందితో పాటు విద్యార్థులు కూడా అక్కడే ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. ఎమ్మెల్యే దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ప్రిన్సిపాల్ పై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ ఘటనకు తీసుకెళ్లాయి అద్యాపక సంఘాలు. ఎమ్మెల్యే తీరుపై జనాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గురువు అనికూడా చూడకుండా అందరి ముందు ఎమ్మెల్యే దారి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనాలు.
ఇవి కూడా చదవండి ..
- శ్మశాన వాటిక వాటికలో సమాధిపై ఓమహిళా తహసేల్దార్ ఫోటోతో క్షుద్రపూజలు
- అసెంబ్లీ రద్దుకు ఉద్దవ్ థాక్రే మొగ్గు?.. సంజయ్ రౌత్ కీలక ట్వీట్..
- అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన : హోంమంత్రి
- ఈటలతో కలిసి ఢిల్లీలో కోమటిరెడ్డి.. అమిత్ షాతో చర్చలు? జూలై 3న బీజేపీలో చేరిక?
- బీజేపీ ఆఫీసులకు సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్లు!
2 Comments