
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జైలుకు వెళతారా? ఆయనపై సీబీఐ ఉచ్చు బిగుసుకుంటోందా? అంటే ఢిల్లీ వర్గాల నుంచే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ చేసింది. అధికారమే లక్ష్యంగా ఢిల్లీ డైరెక్షన్ లో తెలంగాణ బీజేపీ నేతలు దూకుడుగా వెళుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో పాటు సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు బండి సంజయ్. కేసీఆర్ కు జైలుకు పోవడం ఖాయమని పదేపదే చెబుతున్నారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని.. కేసీఆర్ అక్రమాల చిట్టా మొత్తం తమ దగ్గర ఉందని చెబుతున్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను సీబీఐకి ఇస్తామని.. కేసీఆర్ పై విచారణ జరగడం.. ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నట్లే తాజాగా ఢిల్లీలో పరిణామాలు జరుగుతున్నాయి.
Also Read : కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ లీడర్
సీబీఐ డైరెక్టర్ ను కలిసి సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్. కేసీఆర్, ఆయన కుటుంబం 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ కు వివరించారు. ప్రపంచంలో ఎక్కడా ఇంతటి అవినీతి చూడలేదని చెప్పారు. రాష్ట్రప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో తెలంగాణకు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో కేఏ పాల్ వివరించారు.సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కేఏ పాల్ ఆరోపించారు.
Also Read : అర్ధరాత్రి.. బస్సు వెనక సీటులో మహిళపై డ్రైవర్ అత్యాచారం!
తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో కేసీఆర్ కుటుంబం అనేక ఆస్తులు కూడబెట్టిందని సీబీఐ చేసిన ఫిర్యాదులో కేఏ పాల్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయలు స్వాహా చేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి.. మిగిలిన 75 వేల కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబం దోచుకుందని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందన్నారు. 2 వేల కోట్ల అంచనాలో 200 కోట్లు ఖర్చు చేసి మిగితా సొమ్మంతా దోచుకున్నారని తెలిపారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై కూడా విచారణ జరపాలని సీబీఐని కోరారు కేఏ పాల్. సీబీఐతో పాటూ కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలా కు తన ఫిర్యాదు కాపీలను పంపించారు కెఏ పాల్
Read More : కాంగ్రెస్ టికెట్లపై రేవంత్ రెడ్డి సంచలనం..
కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ జరపాలంటూ సీబీఐకి కేఏ పాల్ ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు కేఏ పాల్. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ నేపథ్యంలోనే కేఏ పాల్ సీబీఐ డైరెక్టర్ ను కలిసి గులాబీ బాస్ పై ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ పెద్దల సూచనతోనే కేఏ పాల్ సీబీఐ డైరెక్టర్ ను కలిశారా అన్న చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ కు చిక్కులు తప్పవని రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఇవి కూడా చదవండి …
- కాంగ్రెస్ కూటమితోనే కేసీఆర్.. తెలంగాణలోనూ కలిసిపోతారా?
- కారెక్కనున్న పీకే.. తెలంగాణలో సంచలనం?
- శ్మశాన వాటికలో సమాధిపై ఓమహిళా తహసీల్దార్ ఫోటోతో క్షుద్రపూజలు
- అసెంబ్లీ రద్దుకు ఉద్దవ్ థాక్రే మొగ్గు?.. సంజయ్ రౌత్ కీలక ట్వీట్..
- పెళ్లి ఆపాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది! నవ వధువు మృతిలో ట్విస్ట్..
3 Comments