
క్రైమ్ మిర్రర్, ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీఎత్తుకు పైఎత్తులు వేసే పనిలో ఉన్న శివసేన.. మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. సీఎం ఉద్ధవ్ థాక్రే అసెంబ్లీని రద్దు మొగ్గుచూపుతున్నారని సమాచారం. రాజీపడడం కంటే అసెంబ్లీ రద్దుకు సిద్ధమయ్యి, అధికారాన్ని త్యజించడమే ఉత్తమమని ఉద్ధవ్ థాక్రే భావిస్తున్నారని సమాచారం. ఇందుకోసం మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్‌సీపీలను ఒప్పించబోతున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతూ ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ ‘ సంక్షోభం మహారాష్ట్ర అసెంబ్లీ రద్దుకు దారితీస్తోంది’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొత్త చర్చకు దారితీసింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఈ ట్వీట్‌ను రౌత్ డిలీట్ చేశారు. కాగా ఉద్ధవ్ థాక్రే వైపు ఇంకా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.
Also Read : ఈటలతో కలిసి ఢిల్లీలో కోమటిరెడ్డి.. అమిత్ షాతో చర్చలు? జూలై 3న బీజేపీలో చేరిక?
విశ్వాస పరీక్ష నెగ్గడం కష్టమే!మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) సంకీర్ణ సర్కారు సం క్షోభంలో పడింది. విశ్వాస పరీక్ష పెడితే గట్టెక్కడం కష్టమే! మహారాష్ట్ర అసెం బ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 106 మంది, శివసేనకు 55, కాంగ్రెస్‌కు 44, ఎన్సీపీకి 54 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీల సభ్యులు 29 మంది ఉన్నారు. ప్రస్తుతం ఎంవీఏ సర్కారుకు 152 మంది సభ్యుల బలం ఉంది. అయితే, శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే కొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి సూరత్‌కు వెళ్లిపోయారు. షిండేతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి.
Read More : బీజేపీ ఆఫీసులకు సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్లు!
ప్రస్తుతం మహారాష్ట్రలో ఓ ఎమ్మెల్యే మరణించడంతో అసెంబ్లీలో సంఖ్యా బలం 287గా ఉంది. అంటే విశ్వాస పరీక్ష పెడితే 144 మంది సభ్యులు ఉండాలి. తాజాగా 40 మంది సేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఆ పార్టీ బలం 15కి పడిపోతుంది. ఫలితంగా సభలో సంకీర్ణ సర్కారు బలం 111కి తగ్గిపోతుంది. అయితే 40 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే సభలో కొత్త మెజా రిటీ మార్కు 111కి చేరుతుంది. మరోవైపు కొన్ని వార్తా సంస్థలు షిండేతో 35 మంది ఎమ్మెల్యేలున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్స్ సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి ..
- అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన : హోంమంత్రి
- కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ లీడర్
- సీఎంవో డైరెక్షన్ లోనే సికింద్రాబాద్ లో విధ్వంసం!
- రాకేష్ ను చంపింది టిఆర్ఎస్.. చంపించింది బీజేపీ! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్! జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న కేసీఆర్