
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్‌లో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధునాతన హంగులతో నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో అధునాతన హంగులతో పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించింది. దాదాపు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. 9వేల చదరపుటడుగులకు పైగా విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ పద్దతిలో భవనాన్ని నిర్మించారు.
Read More : ఈటలతో కలిసి ఢిల్లీలో కోమటిరెడ్డి.. అమిత్ షాతో చర్చలు? జూలై 3న బీజేపీలో చేరిక?
ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఫిలింసిటీ డైరెక్టర్ శివరామకృష్ణ, రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. శంకుస్థాపన చేసిన ఏడాదిలోపే నూతన భవనాన్ని అందుబాటులోకి తెచ్చిన రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సేవలను హోంమంత్రి కొనియాడారు.
“అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌ను ఇంత చక్కగా నిర్మించిన రామోజీ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. శంకుస్థాపన చేసిన సంవత్సర కాలంలో అద్భుతంగా నిర్మించి ఇవ్వటం గొప్ప విషయం. రామోజీ ఫౌండేషన్ తన వంతు సామాజిక బాధ్యతగా.. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆ సంస్థ ఎండీ విజయేశ్వరిని అభినందిస్తున్నాను.
ఇవి కూడా చదవండి …
- హైదరాబాద్‌లో మరో దారుణం.. మైనర్ బాలికపై యువకుడి రేప్..
- బయటికొస్తున్న మర్రిగూడ మద్యం మాఫియా లీలలు..
- విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్! జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న కేసీఆర్
- మందుబాబులు పండగ చేస్కోండి.. భారీగా తగ్గనున్న లిక్కర్ ధరలు!
- రేవంత్ రెడ్డికి బిగ్ షాక్… కాంగ్రెస్ కూటమికే కేసీఆర్ సపోర్ట్ !