
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ హైకమాండ్ దూకుడుగా వెళుతోంది.అమిత్ షాతో ఈటల రాజేందర్ చర్చలు తెలంగాణలో ఆసక్తిగా మారగా.. తాజాగా ఢిల్లీలో జరిగిన మరో పరిణామం హాట్ హాట్ గా మారింది. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలుపించుకుని మాట్లాడారు బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈటలకు త్వరలోనే పార్టీలో కీలక పదవి రాబోతుందని తెలుస్తోంది.
Read More : భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యేగా గంగిడి!
అమిత్ షాతో ఈటల రాజేందర్ చర్చలు తెలంగాణలో ఆసక్తిగా మారగా.. తాజాగా ఢిల్లీలో జరిగిన మరో పరిణామం హాట్ హాట్ గా మారింది. అమిత్ షాను కలిసేందుకు ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి వెళ్లారు ఈటల రాజేందర్. అయితే ఈటల వెళ్లింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్.. బీజేపీ అగ్రనేతను కలిసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ఎందుకు వెళ్లారన్నది చర్చగా మారింది. సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గురించి అమిత్ షాతో మాట్లాడటానికే ఈటల రాజేందర్ వెళ్లారా అన్న అనుమానాలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లోనూ ఈ విషయంపై పెద్ద రచ్చే సాగుతోందని తెలుస్తోంది.
Also Read : మునుగోడుకు నేతల తాకిడి… పోటాపోటీగా సాయం! అంతా ఎన్నికల మహిమ?
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో భువనగిరి ఎంపీగా ఉన్నారు. కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. గత ఏడాది బీజేపీకి అనుకూలంగా ఆయన చేసిన ప్రకటనలు కాక రేపాయి. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతోనూ కోమటిరెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని చెప్పారు. ఆ సమయంలోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇక పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించాకా అసమ్మతి స్వరం మరింత పెంచారు. దొంగలకు పదవులు ఇచ్చారని ఓపెన్ గానే కామెంట్ చేశారు. పీసీసీ క్రమశిక్షాణా సంఘం అతనికి నోటీసులు కూడా ఇచ్చింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు రాజగోపాల్ రెడ్డి. రాహుల్ గాంధీ వరంగల్ రైతు గర్జన సభకు కూడా హాజరుకాలేదు. పీసీసీ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాలు మునుగోడు నియోజకవర్గంలో జరగడం లేదు.
Read More : తల్లి కాబోతున్న సింగర్ సునీత… ఇన్ డైరెక్టుగా చెప్పారా?
కోమటిరెడ్డి తీరుతో ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా అన్న అనుమానాలు పార్టీ కేడర్ లోనూ ఉంది. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన పరిణామాలతో మరోసారి సీన్ లోకి వచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈటల రాజేందర్ ఆయన కారులోనే వెళ్లి అమిత్ షాను కలవడంతో.. కోమటిరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి చేరిక గురించి అమిత్ షాతో ఈటల రాజేందర్ చర్చించారని అంటున్నారు. బీజేపీ పెద్దల నుంచి వచ్చిన సూచనలతోనే త్వరలోనే కోమటిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోడీ సహా కేంద్రం పెద్దలంతా హైదరాబాద్ రానున్నారు. ఆ సమయంలోనే బీజేపీ అగ్రనేతల సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం గూటికి చేరుతారని పక్కాగా తెలుస్తోంది.జూలై3న హైదరాబాద్ లో జరిగే బీజేపీ బహిరంగ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువు కప్పుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- బీజేపీ ఆఫీసులకు సెక్యూరిటీ గార్డులుగా అగ్నివీర్లు!
- కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ లీడర్
- సీఎంవో డైరెక్షన్ లోనే సికింద్రాబాద్ లో విధ్వంసం!
- రాకేష్ ను చంపింది టిఆర్ఎస్.. చంపించింది బీజేపీ! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- రైళ్లపై రాళ్ల దాడి.. ప్రయాణికు పరుగులు! సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత
6 Comments