
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగినదేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని ఆరోపించారు. ఈ విధ్వంసం వెనుక సీఎం వ్యూహకర్త పథక రచన ఉందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని… అయినా కేంద్రాన్ని బద్నాం చేయడం సిగ్గు చేటన్నారు. పోలీసుల కాల్పుల్లో మంత్రి చెందిన రాకేశ్ అంతిమ యాత్రలో టీఆర్ఎస్ నేతలు విధ్వంసం స్పష్టించి.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. ఆర్మీ అభ్యర్థులతోపాటు ప్రజలంతా వాస్తవాలు గమనించి కుట్రలను చేధించాలని కోరారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శక్తి కేంద్ర ఇంఛార్జీలతో జరిగిన సమావేశంలో సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read More : నైతిక విలువలు లేని బజారు నేత కేసీఆర్- రేవంత్ రెడ్డి..
తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు బండి సంజయ్. బీజేపీ నేతలను పదేపదే అరెస్ట్ చేస్తారు కాని కాంగ్రెస్ లీడర్లను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తారని అన్నారు. హైదరాబాద్ లో మా తడాఖా చూపిస్తామని ముందే కాంగ్రెసోళ్లు హెచ్చరించి ‘చలో రాజ్ భవన్ ’ పేరుతో విధ్వంసం చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. బీజేపీ గ్రాఫ్ పెరిగింది కాబట్టి… బీజేపీని డామేజ్ చేసి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని సీఎం కేసీఆర్ నీచమైన కుట్రకు తెరతీశారని ఆరోపించారు. కేసీఆర్ దేశమ్మీద పడి తిరిగితే.. కాబోయే సీఎం ఎవరు అనే దానిపై టీఆర్ఎస్ లో గొడవలు మొదలైందన్నారు సంజయ్. తదుపరి సీఎం కేటీఆరా? హరీషా? కవిత ? సంతోషా అనే కొట్లాట జరుగుతుందన్నారు. ఎవరిని సీఎంను చేసినా టీఆర్ఎస్ చీలిపోవడం ఖాయమనే భావన టీఆర్ఎస్ నేతలకు వచ్చిందన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ గ్రాఫ్ 30 శాతానికి పడిపోయిందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ, గౌరవెల్లి నిర్వాసితులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల విషయంలో చర్చ జరగకుండా ప్రజలను దారి మళ్లించేందుకు అగ్నిపథ్ పేరుతో విధ్వంసానికి కేసీఆర్ నీచమైన కుట్ర చేశారని సంజయ్ ఆరోపించారు.
Read More : మిర్యాలగూడకు జానా.. మునుగోడు స్రవంతి! నల్గొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు?
బీజేపీ నాయకులు చిన్న మీటింగులు పెట్టినా, ధర్నాలు చేసినా ఇంటెలిజెన్సుకు తెలుస్తుంది? కానీ వందల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గుమిగూడి విధ్వంసం చేసినా ఆ సమాచారం ఎందుకు రాలేదని సంజయ్ నిలదీశారు. నిజానికి ఇంటెలిజెన్స్ కు ముందే ఈ సమాచారం వచ్చిందని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహం, సహకారంతోనే విధ్వంసానికి కుట్ర జరిగిందని అన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన రాష్ట్ర పోలీసులు కాల్పులు జరపడంవల్లే వరంగల్ జిల్లా యువకుడు చనిపోయాడని చెప్పారు. విధ్వంసం చేసినోళ్లు పారిపోయేలా చేసిన పోలీసులు… అమాయకులైన ఆర్మీ అభ్యర్థులను మాత్రం సాయంత్రం పొద్దుపోయే వరకు అక్కడే ఉంచారని విమర్శించారు. ట్విట్టర్ మంత్రో.. మరోకరో ఆదేశించే వరకు ఖాళీ చేయించలేదన్నారు. అంతా అయిపోయాక రాత్రి సీఎం నిద్రలేని స్పందించడం విడ్డూరమని సంజయ్ మండిపడ్డారు.
More Read : బయటికొస్తున్న మర్రిగూడ మద్యం మాఫియా లీలలు..
రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో టీఆర్ఎస్ నేతలు కేంద్ర సంస్థలపై దాడులు చేసి విధ్వంసం చేస్తుండటం సిగ్గు చేటన్నారు బండి సంజయ్. ఇదంతా ప్రీ ప్లాన్ గా సీఎంఓ నుండి జరుగుతున్న కుట్ర అన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ లో కూడా కేసీఆర్ లాంటోళ్లే దాడులు చేస్తున్నారని.. వీరందరికీ ఓ స్ట్రాటజిస్ట్ ఉన్నారని చెప్పారు. దేశంలో మంచి చేయడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి స్ట్రాటజిస్టు ఉండాలి.. కానీ అందుకు భిన్నంగా బీజేపీని ఎట్లా బదనాం చేయాలి.. కేంద్రంపై ఎట్ల బురద చల్లాలనే కుట్రతో స్ట్రాటజిస్టులు పని చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్మీ అభ్యర్థులు, యువకులు, ప్రజలంతా టీఆర్ఎస్ కుట్రలను గమనించడంతోపాటు అలాంటి వాళ్ల సంగతి చూడాలని కోరారు బండి సంజయ్.
ఇవి కూడా చదవండి …
- కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి సీనియర్ లీడర్
- రాకేష్ ను చంపింది టిఆర్ఎస్.. చంపించింది బీజేపీ! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- రైళ్లపై రాళ్ల దాడి.. ప్రయాణికు పరుగులు! సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత
- హైదరాబాద్‌లో మరో దారుణం.. మైనర్ బాలికపై యువకుడి రేప్..
- తగ్గేదే లే అంటున్న బాసర విద్యార్థులు.. మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ