
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ఇంకా మరవకముందే హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గిరిజన బాలిక అత్యాచారానికి గురైంది. బాలిక గర్భం దాల్చగా నిందితుడు ఆమెకు అబార్షన్ చేయించాడు. బాధిత బాలిక తల్లికి ఈ విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అత్యాచార ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read More : బయటికొస్తున్న మర్రిగూడ మద్యం మాఫియా లీలలు..
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కి చెందిన 14 ఏళ్ల బాలికపై ఆమె ఇంటి పక్కనుండే రవి అనే యువకుడు కన్నేశాడు. బాలిక తండ్రి మరణించడంతో తల్లి కూలీ నాలీ చేస్తూ ఆమెను పోషిస్తోంది. తల్లి కూలీ పనులకు వెళ్తుండగా బాలిక ఇంటి వద్దే ఉంటోంది. బాలిక ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గమనించిన రవి.. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలనుకున్నాడు.ఓరోజు ఇంట్లోకి చొరబడి ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని.. చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. దీంతో బాలిక భయపడిపోయి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇదే అదనుగా నిందితుడు పలుమార్లు బాలికపై అత్యాచారం చేశాడు.
Read More : భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యేగా గంగిడి!
ఇటీవల బాలికకు కడుపు నొప్పి రాగా అతను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాలిక వయసు 20 ఏళ్లు అని అబద్దం చెప్పి.. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేయించాడు. బాలిక గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించడంతో బలవంతంగా ఆమెకు అబార్షన్ చేయించాడు. అబార్షన్ విషయం బయటకు పొక్కితే చంపేస్తానని బెదిరించాడు. బాధిత బాలిక ఈసారి తన తల్లికి అసలు విషయం చెప్పేసింది. దీంతో తన కూతురిని వెంట పెట్టుకుని వెళ్లి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి ..
- తగ్గేదే లే అంటున్న బాసర విద్యార్థులు.. మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
- నైతిక విలువలు లేని బజారు నేత కేసీఆర్- రేవంత్ రెడ్డి..
- మిర్యాలగూడకు జానా.. మునుగోడు స్రవంతి! నల్గొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు?
- ట్రాఫిక్ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!
- అప్పుల పాలై కూలీ పనికి వెళ్తున్న సర్పంచ్
One Comment