
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : అగ్నిపథ్ ఆందోళనలు హైదరాబాద్ కు పాకాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ పరిధిలోని బస్సులపై NSUI కార్యకర్తలు, విద్యార్థులు రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్ వద్దనున్న బస్టాండ్ కు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడున్న ఆందోళనకారులంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పరుగులు తీసి అక్కడ నిలిచి ఉన్న రైళ్లపై విద్యార్థులు రాళ్లు రువ్వారు.
Read More : ట్రాఫిక్ చలానా ఖరీదు చిన్నారి ప్రాణం.!
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. భయంతో రైళ్లు దిగి పరుగులు పెట్టారు. ఆందోళనకారులు పట్టాలపైకి చేరడంతో అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. NSUI కార్యకర్తలు పట్టాల మధ్యలో నిప్పుపెట్టారు.
ఇవి కూడా చదవండి ..
- హైదరాబాద్‌లో మరో దారుణం.. మైనర్ బాలికపై యువకుడి రేప్..
- తగ్గేదే లే అంటున్న బాసర విద్యార్థులు.. మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ
- నైతిక విలువలు లేని బజారు నేత కేసీఆర్- రేవంత్ రెడ్డి..
- మిర్యాలగూడకు జానా.. మునుగోడు స్రవంతి! నల్గొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు?
- అప్పుల పాలై కూలీ పనికి వెళ్తున్న సర్పంచ్ –