Telangana

గ్యాంగ్ రేప్ కేసులో సంచలనం.. ఐదుగురు మైనర్లకు లైంగిక సామర్ద్య పరీక్షలు..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్ద ఆరుగురు నిందితుల‌కు లైంగిక సామ‌ర్ధ్య ప‌రీక్ష‌లు నిర్వహించారు. ఆరుగురు నిందితులను కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అందులో భాగంగానే ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లి పోటెన్సీ టెస్ట్ జరిపించారు. ఈ కేసులో చార్జీషీట్ ధాఖలుకు ఈ పరీక్ష అత్యంత అవసరం.

Read More : మంత్రి సబితమ్మకు షాక్.. తీగలకు జై కొట్టిన టీఆర్ఎస్ కేడర్

నిందితుల‌కు లైంగిక సామ‌ర్ధ్య ప‌రీక్ష‌లు చేయించేందుకే వారిని పోలీసులు ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సదరు ప‌రీక్ష‌ల అనంతరం పోలీసులు తిరిగి నిందితుల‌ను పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మైన‌ర్ బాలురు అత్యాచారానికి ఎలా పాల్ప‌డ‌తార‌న్న వాద‌న‌ల‌ను ప‌టాపంచ‌లు చేసే దిశ‌గానే పోలీసులు నిందితుల‌కు లైంగిక సామ‌ర్థ్య ప‌రీక్ష‌లు చేయించిన‌ట్టు స‌మాచారం. ఈ ప‌రీక్ష‌ల నివేదిక‌ల‌ను పోలీసులు నేరాభియోగ‌ప‌త్రానికి జ‌త చేయ‌నున్నారు. ఈ కేసులో ప‌క్కా సాక్ష్యాధారాలు సేక‌రించాల‌న్న దిశ‌గా సాగుతున్న క్ర‌మంలోనే పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు స‌మాచారం.

Read More : వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారా?

జువెనైల్ కోర్టు అనుమతితో ఎమ్మెల్యే కొడుకుతో పాటు మిగితా ఐదుగురు మైనర్లను ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. న్నారు. మేజర్ సాదుద్దీన్ మాలిక్ తో పాటు ఐదుగురు మైనర్లను.. ఈ కేసులో ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న బంజారాహిల్స్ ఏసిపి సుదర్శన్ ప్రశ్నించారు.ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, బల్దియా కార్పొరేటర్ తనయుడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు, సంగారెడ్డి టీఆర్ఎస్ నేత కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితో పాటు మరో మైనర్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.రెండు రోజుల విచారణలో గ్యాంగ్ రేప్ కు సంబంధించి కీలక విషయాలను సాదుద్దీన్ మాలిక్ పోలీసులు చెప్పారని తెలుస్తోంది. ఏ1 నిందితుడు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని చెబుతున్నారు. సాదుద్దీన్ చెబుతున్న విషయాలను తమ దగ్గర ఉన్న సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజ్ తో సరి చూసుకుంటున్నారు పోలీసులు. ఏదైనా తేడా అనిపిస్తే మాలిక్ ను పలు కోణాల్లో ప్రశ్నించి క్లారిటీ వచ్చేలా చూసుకుంటున్నారు.

Read More : మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై చెప్పుతో రైతు దాడి

మరోవైపు గ్యాంగ్ రేప్ కు గురైన మైనర్ బాలిక మెడికల్ రిపోర్టులో సంచలన అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. అత్యాచారం చేసే సమయంలో బాలికను నిందితులు దారుణంగా హింసించారని తెలుస్తోంది. బాధితురాలి మెడ చుట్టూ పళ్లతో కొరిగిన గాయాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఏడు ఎనిమిది చోట్ల పంటి గాయాలు స్పష్టంగా ఉన్నాయని వైద్యులు పోలీసులకు నివేదిక ఇచ్చారు. బాలిక గోళ్లతో రక్కిన గుర్తులు కూడా ఉన్నాయి. రేప్ చేసే సమయంలో బాలిక ప్రతిఘటించడంతో నిందితులు దారుణంగా హింసించారని పోలీసులు భావిస్తున్నారు. గ్యాంగ్ రేప్ జరిగిన ఇన్నోవా వాహనంలో పోలీసులు సేకరింతిన ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపారు. దానికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. ఫోరెన్సిక్ నివేదికలో మరిన్ని సంచలన అంశాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి ..

  1. భానుడి భగభగలు.. కొవిడ్ కేసులు! తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు..?
  2. జన్మదిన వేడుకలతో తీగలకు పూర్వవైభవం..తీగల వర్గీయుల్లో నయా జోష్
  3. నన్ను ఎవరూ అడ్డుకోలేరు.. చేయాల్సింది చేసి తీరుతా! కేసీఆర్ కు గవర్నర్ వార్నింగ్..
  4. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హైదరాబాద్ లో మరో కిరాతకం
  5. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులకు ఉరి శిక్ష? ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు..

ad 728x120 SRI swami - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.