
క్రైమ్ మిర్రర్, మహేశ్వరం : హైదరాబాద్ లో బాలికలకు రక్షణే లేదా అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. రోజూ ఏదో ఒక చోటు మహిళపై జరిగిన అఘాయిత్యాలు బయటికి వస్తూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్ నగర్‌లో 9 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలికను బెదిరించి దారుణాన్ని పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక పెరెంట్స్ ..ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేదం.. తెలంగాణ సర్కార్ సంచలనం
దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు ఆటో డ్రైవర్ సలీంను అరెస్ట్ చేశారు. అత్యాచారానికి గురై బాలిక కుటుంబసభ్యులను మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పరామర్శించారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వారితో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు.
Read More : భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యేగా గంగిడి!
హైదరాబాద్‌లో వరుస ఘటనలు వెలుగు చూస్తుడటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ చేతగాని తనం వల్లే దారుణాలు వెలుగు చూస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మానవ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులంతా రాజకీయ నాయకుల కుమారులే కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి ..
- మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై చెప్పుతో రైతు దాడి
- జన్మదిన వేడుకలతో తీగలకు పూర్వవైభవం..తీగల వర్గీయుల్లో నయా జోష్
- నన్ను ఎవరూ అడ్డుకోలేరు.. చేయాల్సింది చేసి తీరుతా! కేసీఆర్ కు గవర్నర్ వార్నింగ్..
- సాయంత్రం కేసీఆర్ కీలక సమావేశం.. సంచలనం జరగబోతోందా?
- జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులకు ఉరి శిక్ష? ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు..
One Comment