
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈక్రమంలో ఈఘటనపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. దిశా ఘటన మరవకముందే మళ్లీ ఇలాంటి దారుణం చోటుచేసుకోవడం తన మనసును కలిచివేసిందన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Also Read : పోలీసుల నుంచే మైనర్ బాలిక వీడియో లీక్? రఘునందన్ కు సెండ్ చేసిందెవరు?
కొందరు మృగాళ్లు వారు ప్రయాణిస్తున్న కారులోనే సామూహిక అత్యాచారం చేయడం మాటలకు అందని దుర్మార్గమని చెప్పారు. అల్లారుముద్దుగా పెంచుకునే బిడ్డలపై ఇలాంటి ఘటనలు జరిగితే వారి తల్లిదండ్రులు బాధలు ఎలా ఉంటాయో తనకు తెలుసు అని అన్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారికి అత్యాచారమనే ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరమన్నారు. ఈకేసులో నిందితులు ఎవరూ తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్.
Read More : దుబాయ్ చెక్కేసిన ఎమ్మెల్యే కొడుకు? గ్యాంగ్ రేప్ కేసును నీరుగార్చేపనిలో బడా నేత?
ఈకేసు విచారణ చురుగ్గా సాగుతున్నా దోషులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలన్నారు. ఆమె సత్వర న్యాయం జరగడంతో పాటు బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలన్నారు. దోషుల కుటుంబాల నుంచి భారీ నష్ట పరిహారం రాబట్టి బాధితురాలికి అందజేయాలన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్.
ఇవి కూడా చదవండి ..
- భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యేగా గంగిడి!
- నలుగురు పోలీస్ అధికారులకు 4 వారాల జైలు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
- పక్కా ప్లాన్ ప్రకారమే గ్యాంగ్ రేప్.. ఆ రోజు ఏం జరిగిందో మినిట్ టు మినిట్
- నగరంలో మరో దారుణం.. బాలిక కిడ్నాప్ కలకలం
- పొత్తులపై జనసేనాని మూడు ఆప్షన్లు… జనసేనతో పొత్తు కొనసాగుతుందన్న బీజేపీ
One Comment