
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : ఓడలు బండ్లవుతాయి… బండ్లు ఓడలవుతాయి అంటారు. మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు అచ్చం ఈ సామెతకు అచ్చుగుద్దినట్లుగా ఉన్నాయి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసమే ఇంటింటికి తిరిగే లీడర్లు… ఎన్నికలయ్యాక ప్రజలను గాలి కొదిలేస్తారు. సమస్యలున్నాయని చెప్పినా వాళ్ల వైపు చూడరు. తాము గోడు చెప్పుకుందామనుకున్నా అందుబాటులో ఉండరు. అంతా పీఏలతోనే నడిపిస్తుంటారు. మండలానికో ఇద్దరు నేతలను పెట్టుకుని.. వాళ్లతోనే రాజకీయమంతా నడిపిస్తుంటారు. ఫోన్ లో చెబుతామని ఎప్పుడు కాల్ చేసినా పీఏనే లిఫ్ట్ చేస్తుంటారు. అలా ఉంటుంది మన లీడర్ల తీరు. కాని నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మాత్రం ప్రస్తుతం సీన్ మారిపోయింది. వద్దంటే వస్తున్నారు లీడర్లు. పిలిస్తే చాలు వాలిపోతున్నారు. ఉదయం లేవగానే గ్రామాల్లో ప్రత్యక్షమవుతున్నారు.
Read More : దసరా తర్వాత ఢిల్లీలోనే కేసీఆర్ మకాం!
మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడా చూసినా ఇప్పుడు ఖరీదైన కార్లే కనిపిస్తున్నాయి. ఒకరా ఇద్దరా ఏకంగా డజన్ మంది లీడర్లు పోటాపోటీగా తిరుగుతున్నారు. ఎవరికి కష్టం వచ్చినా అక్కడ వాలిపోతున్నారు. సాయం చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. తమ రోజువారి కార్యక్రమాల ప్రచారం కోసం ప్రత్యేకంగా కొందరిని నియమించుకున్నారు లీడర్లు. వాళ్లు ఏం చేసినా నిమిషాల్లోనే వాట్సాప్, ఫేస్ బుక్ లో అది వచ్చేస్తోంది. అంతగా టెక్నాలజీని వాడేసుకుంటున్నారు.. గతంలో పెద్ద స్థాయి లీడర్ ఇంట్లో కార్యాలు ఉంటనే ఎమ్మెల్యే స్థాయి నేతలు వచ్చే వారు. కాని ఇప్పుడు చిన్న పల్లెటూరులో పంక్షన్ జరిగినా… లీడర్లంతా పోటాపోటీగా వాలిపోతున్నారు. ఆహ్వానం లేకున్నా తెలిస్తే చాలు వచ్చి ఆశీర్వదించి పోతున్నారనే టాక్ కూడా వస్తోంది.
Read More : కేసీఆర్ డుమ్మా… స్టాలిన్ గర్జన! తెలంగాణ సీఎంపై జనాల ఫైర్..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కువగా నియోజకవర్గంలో తిరగరు. ఉన్నదంతా టీఆర్ఎస్ లీడర్లే. వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నేతలంతా ఇలా జనంలోకి వెళుతున్నారు. శుభాకార్యమైనా, చావైనా అట్టే వాలిపోతున్నారు. ఎవరూ చనిపోయినా వెళ్లి ఎంతో కొంత సాయం చేస్తున్నారు. ఈ విషయంలో కంచర్ల కృష్ణారెడ్డి ముందున్నారు. మునుగోడు నుంచి ఎలాగైనా పోటీ చేయాలని భావిస్తున్న కంచర్ల గత నెలరోజులుగా నిత్యం జనంలోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో ఎవరూ చనిపోయినా వెళ్లి పరామర్శిస్తున్నారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసినా…. వాళ్లకు చికిత్స కోసం సాయం చేస్తున్నారు. గుళ్లు, గోపురాలకు అడిగిందే తడవుగా డబ్బులు విరాళం ఇస్తున్నారు కంచర్ల కృష్ణారెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పుడాయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.
Read More : ఆరా.. తీస్తున్న నిఘా సంస్థలు… ముంత కాబ్ ముఠాతో చేతులు కలిపిన పలువురు ఖాకీలు
మునుగోడు టికెట్ ఆశిస్తున్న నారబోయిన రవి ముదిరాజ్ కూడా కంచర్ల బాటలోనే పయనిస్తున్నారు. గతంలో మునుగోడు మండలం వరకే పరిమితమైన నారబోయిన… ఇప్పుడు నియోజకవర్గం మొత్తం తిరిగేస్తున్నారు. ఆయన కూడా ఎవరూ చనిపోయినా వెళ్లి సాయం చేస్తున్నారు. నాంపల్లి మండలానికి చెందిన మరో నాయకుడు కర్నాటి విద్యాసాగర్ కూడా జోరుగా తిరుగుతున్నారు. ఆయన కూడా శుభాకార్యాలకు హాజరవుతూ..కష్టాల్లో ఉన్నవాళ్లకు ఆర్థిక సాయం చేస్తూ ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలం నియోజకవర్గంలో తనకు తిరుగేలేదని భావించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. తనకు పోటీ పెరగడంతో అప్రమత్తమయ్యారు. రోజు 10 నుంచి 15 గ్రామాలు చుట్టేస్తున్నారు. ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన స్థానిక నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలు ఉన్నాయని చెబితే హైదరాబాద్ వచ్చి కలవాలని చెప్పిన కూసుకుంట్ల… ఇప్పుడు మాత్రం ఉదయాన్నే గ్రామాల్లో వాలిపోతున్నారు. ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండానే ఎప్పటిలానే నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు.
Also Read : సర్జరీ కోసం పేషెంట్ పుర్రెను తొలగించి.. అతికించకుండానే డిశ్చార్జ్! దారుణం.
రాజకీయ నేతల తీరుపై మునుగోడు నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. ఓట్ల కోసమే ఇన్ని పాట్లు పడుతున్నారని అంటున్నారు అయితే . టికెట్ కోసం పోటీ ఉండటంతో పోటాపోటీగా సాయం చేస్తుండటంతో పేదలకు మాత్రం న్యాయం జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేతలు ఓట్ల కోసమే కాకుండా ఎప్పుడూ ఇలానే ఉంటే ప్రజలు ఆదరిస్తారని చెబుతున్నారు. మొత్తంగా నేతల తాకిడితో మునుగోడు నియోజకవర్గంలో నిత్యం సందడే కనిపిస్తోంది. అదే సమయంలో చోటామోటా లీడర్లకు కాలం కలిసివస్తుందనే టాక్ వస్తోంది. ఎన్నికల సమయానికి ఈ రాజకీయం ఇంకెంత రంజుగా ఉంటుందో చూడాలి మరీ…
ఇవి కూడా చదవండి …
- ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్! చంద్రబాబు ఫ్యాన్స్ పరేషాన్?
- బెల్ట్ షాపుల ముసుగులో వ్యభిచారం.. నకీలి సరుకుతో కోట్లకు పడగలు..?
- రేవంత్ కులపిచ్చోడు.. సంజయ్ మతపిచ్చోడు! ప్రజల మధ్య చిచ్చు.. షర్మిల ఫైర్
- రథం తరలిస్తుండగా.. విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి
- ఐ డోంట్ కేర్.. ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత? పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నాకు ఓ లెక్కే కాదు
3 Comments