
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అన్నారు. ఓటు కు నోటు కేసులో దొరికిన దొంగ కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్షుడు గా ఉన్నారని అన్నారు. రెడ్డి సమాజంకు అధికారం ఇవ్వాలట.. న్యాయకత్వం కట్టబెట్టాలట .. ఇతర కులాలు న్యాయకత్వానికి పనికి రారట.. రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతుంటే ఆయనపై అధిష్టానం కనీసం చర్యలు కూడా లేవన్నారు షర్మిల. పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ఒక మాట మాత్రం నిజమే చెప్పారన్నారు.
Also Read : ఆరా.. తీస్తున్న నిఘా సంస్థలు… ముంత కాబ్ ముఠాతో చేతులు కలిపిన పలువురు ఖాకీలు
వైఎస్సార్ తోనే రాష్ట్రంలో అటు కేంద్రం లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందన్నారు షర్మిల.వైఎస్సార్ ఏనాడూ కూడా ఒక కులం ఎక్కువ..ఒక కులం తక్కువ అని చూడలేని చెప్పారు షర్మిల. అన్ని కులాలను, మతాలను వైఎస్సార్ గౌరవించారని అన్నారు.అన్ని కులాల అభివృద్ధి కోసం వైఎస్సార్ పరితపించారని తెలిపారు.ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉండాలి .విశ్వసనీయత ఉండాలని..రెడ్డి సామాజిక వర్గం మిగతా వర్గాలను ఆదుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు రెడ్డి సమాజాన్ని గుర్తు పెట్టుకున్నారని.. కాని సమాజం ఎప్పుడు బ్లాక్ మెయిలర్ లను గౌరవించదని అన్నారు ప్రజలకు కావాల్సింది కులం కాదు..గుణం అని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు షర్మిల.
Read More : సర్జరీ కోసం పేషెంట్ పుర్రెను తొలగించి.. అతికించకుండానే డిశ్చార్జ్!
కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తుంటే..బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని షర్మిల విమర్శించారు. మసీదులను కూల గొడతారు అంట.. శవాలు ఉంటే ముస్లీంలవి అంట..శివుడు ఉంటే హిందువులవి అంట… ఉర్దూ భాష లేకుండా చేస్తారట.. ఇంత దారుణంగా మాట్లాడుతుంటే బండి సంజయ్ పై చర్యలు ఏవి అని షర్మిల ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా .. రాచరికమా అని నిలదీశారు. మా పిచ్చోడి చేతిలో రాయి… బండి సంజయ్ చేతిలో బీజేపీ పార్టీ రెండు ఒకటేనని ఎద్దేవా చేశారు. మతాలను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.ప్రజలు శాంతిగా ఉండటం మీకు ఇష్టం లేదా…రక్తం ఏరులై పారాలా.. ప్రజలు కొట్టుకొని చావాలా అని షర్మిల ప్రశ్నించారు.అగ్గి పెట్టి చలి కాచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి ఆధారాలు ఉన్నాయంటున్న బీజేపీ నేతలు ఎందుకు బయటపెట్టడం లేదని షర్మిల ప్రశ్నించారు. ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగించడం మోడీ కాదు కదా .. అమిత్ షా వల్ల కూడా కాదన్నారు వైఎస్ షర్మిల.
ఇవి కూడా చదవండి…
రథం తరలిస్తుండగా.. విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి
ఐ డోంట్ కేర్.. ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత? పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నాకు ఓ లెక్కే కాదు
2 Comments