
- మనసురాబాద్ సర్వేనెంబర్ 7లో ఉన్నదంతా డీర్ పార్కే
- బాధితుల ఆందోళనతో దిగివస్తున్న ఏజెంట్లు
- చేసేదిలేక డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందాలు…
క్రైమ్ మిర్రర్, ఇన్వెస్ట్ గేషన్ బ్యూరో : మందిని ఏమార్చి సంపాదించిన డబ్బుతో మదమెక్కి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ని ఒక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్.,. తనకు ఉద్యోగం ఒక లెక్కే కాదన్నట్లు వ్యవహరిస్తున్నాడు. గత మూడు రోజులుగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఓ కానిస్టేబుల్ చేసిన భూదందాల పై క్రైమ్ మిర్రర్ దినపత్రికలో వరుస కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో… నిఘా సంస్థలు ” ” “ఎవరా … ఆ కానిస్టేబుల్ “‘ అని ఆరా తీస్తున్న నేపథ్యంలో, సదరు కానిస్టేబుల్ మాత్రం, అడ్డగోలుగా , అక్రమంగా సంపాదించిన ఆస్తులను చూసుకొని తణుకు కానిస్టేబుల్ ఉద్యోగం ఒక లెక్కే కాదన్నట్లు వ్యవహరిస్తున్నాడు.
Read More : ఆరా.. తీస్తున్న నిఘా సంస్థలు… ముంత కాబ్ ముఠాతో చేతులు కలిపిన పలువురు ఖాకీలు
ఇప్పటికే వందలాది మంది అమాయకులను ప్లాట్లు ఇప్పిస్తానని మోసం చేసి వారి వద్ద నుంచి లక్షల రూపాయలను వసూలు చేసి కోట్లకు పడగలెత్తిన కందుకూరు ఆ కానిస్టేబుల్… నిఘా సంస్థల నేత్రానికి మాత్రం చిక్కకుండా ముందస్తుగానే రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. తాను కానిస్టేబుల్ కావడంతో, తన సొంత ఊరిలో తన బంధువు ని అడ్డంగా పెట్టుకుని అతని పేరిట ముంత కాబ్ భూదందాల నిర్వహించినట్లు తెలుస్తోంది. చేసేది తానైన… తన బంధువు పేరిటో 2011 బ్యాచ్ కు చెందిన ఆ కానిస్టేబుల్ ప్రస్తుతం… ఇబ్రహీంపట్నం ఏసీపీ జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నట్లు బాధితులు తెలియజేస్తున్నారు.
నిఘా సంస్థలు మాత్రం ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు, పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుండడం చూస్తుంటే… సదరు కానిస్టేబుల్ మాత్రం నవ్వుకుంటున్న ట్లు సమాచారం. ఇక తనకు కానిస్టేబుల్ ఉద్యోగం ఉన్నది, పెద్దగా ఉపయోగపడదని భావిస్తున్న 2011 బ్యాచ్ కానిస్టేబుల్, కూడబెట్టిన కోట్ల ఆస్తులను చూసుకొని మురిసి పోతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
డ్రెస్ ఇప్పి చూడు… బాధితులు నీ ఇంటి ముందు క్యూ కడతారు
పోలీస్ కానిస్టేబుల్ గా కొనసాగుతుండడం వల్లే, లక్షలాది రూపాయలు చెల్లించిన బాధితులు కానిస్టేబుల్ ఇంటి ముందుకు వచ్చేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది.. అయితే, ఒక్కసారి సదరు కానిస్టేబుల్ పోలీస్ డ్రెస్ విప్పి తే… బాధితులు అందరూ రూ ఆయన ఇంటిని చుట్టుముట్టడం ఖాయమని తెలుస్తోంది.. ఇక, మన్సురాబాద్ సర్వేనెంబర్ 7లో వందలాది ఎకరాల భూమి తమదేనంటూ నల్లగొండ పట్టణానికి చెందిన దంపతులు, నెల్లూరు నగరం నుంచి వచ్చే పాతబస్తీలో స్థిరపడిన ఒక న్యాయవాది… వేలాది కుటుంబాల నుంచి ప్లాట్లు ఇప్పిస్తామని పైసలు వసూలు చేసిన ఈ దందాలో, ఇప్పటికే బాధితులు… తమ్ముడు డబ్బులు తమకు తిరిగి ఇచ్చేయాలని ముఠా సభ్యులను నిలదీస్తున్నారు.
Read More : పేరు కేమో కానిస్టేబుల్… ముంత కాబ్ ముఠా సభ్యుడు
తాజాగా సరూర్ నగర్ లో ఒక ఏజెంట్ ను, బాధితురాలి కుటుంబ సభ్యుడు తమకు ప్లాట్లు అవసరం లేదని, తాము కట్టిన డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో చేసేదిలేక… డబ్బులను ఇచ్చి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో, ముఠా సభ్యుల్లో ఆందోళన మొదలైంది. డబ్బులు కట్టిన బాధితులు అందరూ తమ డబ్బులు నమో కు ఇచ్చే చేయమంటే పరిస్థితి ఏమిటన్న డైలమాలో పడ్డారు.
ఇవి కూడా చదవండి …
- దసరా తర్వాత ఢిల్లీలోనే కేసీఆర్ మకాం!
- కేసీఆర్ డుమ్మా… స్టాలిన్ గర్జన! తెలంగాణ సీఎంపై జనాల ఫైర్..
- సర్జరీ కోసం పేషెంట్ పుర్రెను తొలగించి.. అతికించకుండానే డిశ్చార్జ్! దారుణం..
- మన్యంలో మరో నయీం ‘అనంత’ రూపాలు.. తన ఆదేశాలే ప్రైవేటు చట్టాలు..
- మూడు నెలల్లో దేశంలో సంచలనం.. జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యమన్న కేసీఆర్
One Comment