
- రెండు వేల మందినీ.. బురిడీ కొట్టించిన ఘనుడు
- పేద, మధ్యతరగతి ఫ్యామిలీ లకు ప్లాట్లు ఇప్పిస్తామని ఆశ చూపి…
- కమిషన్లు గానే రెండు కోట్లు దండుకున్నాడు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ముంత కాబ్ ముఠాలో నల్లగొండ దంపతులు, పాతబస్తీకి చెందిన ఓ న్యాయవాది తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కూడా కీలక సభ్యుడే నని తెలుస్తోంది. నిజాం హయాంలో నాటి ముంత కాబ్ ఉన్నదని, దాని ఆధారంగా మన్సూరాబాద్ పరిధిలోని సర్వే నెంబర్ 1 నుంచి 250 లలో ఉన్న వందలాది ఎకరాల భూములు తమదేనని నల్లగొండ దంపతులు చెప్పుకొచ్చారు.
దానిని ఆధారంగా చేసుకొని నెల్లూరు నగరానికి చెందిన పాతబస్తీలో స్థిరపడిన ఓ న్యాయవాది, ఆ దంపతుల తో కలిసి, పేద కుటుంబాలకు 100 గజాల ప్లాటు ఇస్తామని నమ్మబలికారు. ఫ్లాట్ కావాలనుకునేవారు ముందుగా లక్ష రూపాయలు చెల్లించాలని, దానికి వంద గజాల స్థలాన్ని నోటరీ చేసి ఇస్తామని నల్లగొండ దంపతులు, న్యాయవాది చెప్పుకొచ్చారు. అయితే హైదరాబాదు నగరంలో ఇంటి స్థలం కావాలనుకునీ ఆరాటపడే పేదలను రాచకొండ పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. తనకు పరిచయం ఉన్న వారిని మచిక చేసుకుని ఇంటి స్థలాలన్ని ఇప్పిస్తామని నమ్మబలికి. వారి వద్ద అ డబ్బులను వసూలుచేసి ముంత కాబ్ ముఠాకు అప్పగించినట్లు తెలుస్తోంది.
Also Read : అంబేద్కర్ పేరు కడప జిల్లాకు పెట్టుకో.. జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్
అయితే, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఇచ్చినందుకు సదరు కానిస్టేబుల్ కు పదివేల రూపాయలు కమిషన్ గా ఇంత కాపు ముఠా అప్పజెప్పినట్లు సమాచారం.. దాదాపు రెండు వేల మంది నీ , కానిస్టేబుల్ నమ్మించి ఇళ్ల స్థలాలను ఇప్పిస్తానని చెప్పి డబ్బులను ఇంత కోపం ముఠాకు కట్టించినట్లు ఒకరిద్దరు బాధితులు పేర్కొన్నారు. ప్లాట్ల గురించి ఎప్పుడు అడిగినా ఇదిగో వస్తాయి అది గో వస్తాయి అంటూ కాలం వెళ్లదీస్తున్నా డని అని వారు పేర్కొంటున్నారు. ముంత కాబ్ ముఠాకు, అమాయక పేదలకు నుంచి డబ్బులు క ట్టించినందుకు అతడికి రెండు కోట్ల రూపాయలు కమిషన్ రూపంలోనే లభించాయంటే, ఈ ముఠా ఒక్కొక్కరి వద్ద నుంచి ఎంత డబ్బులు వసూలు చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి ..
- మన్యంలో మరో నయీం ‘అనంత’ రూపాలు.. తన ఆదేశాలే ప్రైవేటు చట్టాలు..
- మూడు నెలల్లో దేశంలో సంచలనం.. జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యమన్న కేసీఆర్
- రేవంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, బీసీలు తిరగబడతారు.. మధుయాష్కీ లేఖతో టీకాంగ్రెస్ లో కలకలం
- ప్రధాని మోడీని ప్రశ్నిస్తూ హైదరాబాద్ లో బ్యానర్లు.. పోలీసుల పరేషాన్
- కూసుకుంట్ల అండతో అనుచరుల అక్రమాలు.. ప్రశ్నించిన సొంత పార్టీ సర్పంచ్ పైనే కేసు!
2 Comments