
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఉండటం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ కారులో డెడ్ బాడీ ఉండటం సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం ఉంది. డెడ్ బాడీ ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రమణ్యానిదిగా గుర్తించారు. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పారు.
Also Read : హైదరాబాద్ లో మరో పరువు హత్య.. బేగంబజార్ లో వెంటాడి చంపిన దుండగులు
ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి సమాచారం ఇచ్చారు డెడ్ బాడీని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కారులో తీసుకొచ్చారు ఎమ్మెల్సీ అనంతబాబు. అయితే మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో డెడ్ బాడీ ఉన్న కారు అక్కడే వదిలి మరో కారులో వెళ్లిపోయారు మ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్.
ఎమ్మెల్సీ డ్రైవర్ చనిపోవడం.. ఎమ్మెల్సీనే డెడ్ బాడీని తన కారులో తీసుకుని రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తన కొడుకును గురువారం ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ తీసుకెళ్లారని సుబ్రమణ్యం తల్లిదండ్రులు చెబుతున్నారు. తన కొడుకును హత్య చేశారని ఆరోపిస్తున్నారు. కొట్టి చంపి ప్రమాదంగా చెబుతున్నారని అంటున్నారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. డెడ్ బాడీని ఎమ్మెల్సీ ఇంటికి ఎలా తీసుకువస్తారని ప్రశ్నిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ దగ్గర సుబ్రమణ్యం డ్రైవర్ గా పని చేస్తున్నారని బంధువులు చెప్పారు.
ఇవి కూడా చదవండి ..
- ఢిల్లీలో కేసీఆర్..విదేశాల్లో కేటీఆర్! తెలంగాణలో పడకేసిన పాలన..
- తెలంగాణలో జనసేనే కింగ్ మేకర్.. 80 సీట్లకు పోటీ చేస్తామన్న పవన్ కల్యాణ్..
- దిశా నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం.. 10 మంది పోలీసులపై మర్డర్ కేసు!
- జగన్ కోటాలో పార్థసారథి రెడ్డికి కేసీఆర్ రాజ్యసభ సీటు!
2 Comments