
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి హైదరాబాద్ లో దాదాపు ఎకరం భూమిని కేటాయిస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ హైదరాబాద్ నడిబొడ్డున వందలకోట్ల విలువైన భూమిని అప్పన్నంగా కొట్టేయడానికి ప్లాన్ వేసారని… అందులోభాగంగానే టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పేరిట నాటకాలాడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆ వ్యవహారంపై టిపిసిపి చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికన ఘాటుగా స్పందించారు.
గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి లేదని హామీ ఇచ్చిన దళితులకు మూడెకరాలు ఇవ్వడానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి భూమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ రేవంత్. కానీ, టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు నగరం నడిబొడ్డున రూ.100 కోట్ల విలువైన భూమి అప్పనంగా కొట్టేయడానికి మాత్రం భూమి ఉందని మండిపడ్డారు రేవంత్. ఎవని పాలయిందిరో తెలంగాణ జాతి సంపద దోస్తున్నవాడి పాలయిందిరో తెలంగాణ! అని రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించార
Also Read : మునుగోడులో ఒంటరైన కూసుకుంట్ల! టీఆర్ఎస్ కు కొత్త లీడర్ ఎవరో?
తెలంగాణ ఏర్పాటు సమయంలో పది జిల్లాలుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పునర్వ్యవస్థీకరించి 33 జిల్లాలుగా చేశారు. ఇప్పటికే పాతజిల్లాల్లో మాదిరిగానే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అదునాతనంగా సమీకృత కలెక్టరేట్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ఇతరత్రా మౌళికసదుపాయాల కోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తోంది. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ కార్యాలయాల కోసం కూడా ప్రభుత్వ భూములు కేటాయించడం వివాదాస్పదంగా మారింది. జిల్లాల్లో భూముల ధరలు తక్కువగా వుంటాయి కాబట్టి టీఆర్ఎస్ కార్యాలయాలకు భూముల కేటాయింపుపై ప్రతిపక్షాలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. కానీ తాజాగా హైదరాబాద్ జిల్లా కార్యాలయం కోసం నగర నడిబొడ్డును అత్యంత ఖరీదైన భూమిని కేటాయించడం తీవ్ర దుమారం రేపింది. బంజారాహిల్స్ ఎన్‌బీటీ నగర్‌లో వందలకోట్ల విలువచేసే 4,935 చదరపు గజాల స్థలాన్ని టీఆర్ఎస్ ఆఫీస్ కోసం కేటాయించడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
ఇవి కూడా చదవండి …
- కూసుకుంట్లను తరిమికొడతామంటున్న జనం.. అసలేం జరిగింది?
- టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు?
- బండి సంజయ్ కి షాక్.. పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
- గన్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య….
- మహిళ వీడియోతో సంజయ్ కి కేటీఆర్ వార్నింగ్!
One Comment