

- చీకటిమాటున కబేళాళకు తరలిపోతున్న గోమాతలు
- సోషల్ మీడియా ద్వారా తెరపైకి వచ్చిన అక్రమ రవాణా
- ఆసిఫాబాలో ఒకరిపై కేసు నమోదు, మరి కొందరి పై విచారణ
- వాంకిడిలో ముగ్గురి పై కేసు నమోదు
క్రైమ్ మిర్రర్, ఉమ్మడి ఆదిలాబాద్ : హిందూవులు ఆరాద్యదైవం గోమాతల రక్షణ కోసం ప్రత్యేక గో సంరక్షణ శాలలు నిర్మింస్తుంటే వాటిని కాపాడే కాపలా దార్లే గోమాతలను అమ్మేస్తున్న వైనం తాజాగా కొమురం భీం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న గోవుల అక్రమ రవాణా సంబందించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దీని పై భజరంగ్ దళ్ మరియు ఐక్య సంఘాల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేశారు.
వాంకిడి మండలం గోయగం, గణేష్ పూర్ గ్రామంలలో పశువుల సంత నిత్యం కొనసాగుతోంది. ఇందులో పశువులు అక్రమంగా రవాణా జరుగుతుంది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.., రాత్రి వేళల్లో వాహనాలను అపి అక్రమ వసూళ్లకు పాలుపడ్డారు. వాహనాలు అపి డీల్ మాట్లాడం లేదంటే పోలీస్ లకు సమాచారం ఇవ్వడం కేసు నమోదు చేపించడం అలా కేసు నమోదు అయిన ఆవులను గోశాలకు తరలించడం అంత పక్క ప్రణాళికతో సాగింది. ఇందుకోసం వారు జిల్లా కేంద్రంలోని కౌటగూడ గ్రామంలో ద్వారాకామయి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి గోశాల ఏర్పాటు చేశారు. పట్టుకున్న ఆవులను గోశాలకి తరలించి మరుసటిరోజు కబేళాలకు తరలించడం చేశారు. ఇది గమనించిన కొందరు యువకులు వారి అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. వీడియోలు తీశారు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో భజరంగ్ దళ్ మరియు ఐక్య సంఘాల ఫిర్యాదులుతో కేసు దర్యాప్తు చేసి గోశాల అధ్యక్షుడు అయిన రాజేంద్రప్రసాద్ ను అరెస్ట్ చేసారు. ఈ ఘటన పై క్రైమ్ మిర్రర్ ప్రతినిధి ఆసిఫాబాద్ సి.ఐ రాణాప్రతాప్ పూర్తి సమాచారాన్ని అందించారు.
Also Read : శవాలపై వైద్యుడి కాసుల వేట… పోస్ట్ మార్టంపై డాక్టర్ సందాని లంచం
ద్వారాకామయి గోశాలలో ఇప్పటి వరకు 56 పశువులు(ఆవులు,ఎడ్లు) వుండాలి. కానీ 26 మాత్రమే వున్నాయని మిగిలిన పశువుల గురించి సరియైన సమాధానం చెప్పక పొడవడంతో, గోశాల నిర్వహకుడైన రాజేంద్రప్రసాద్ పై క్రైమ్ నం.145/2022 సెక్షన్ ప్రకారం 403,408,409 కేసు నమోదు చేశామని, ఇందులో వున్న మిగితావారిపై కూడా విచారణ చేపడుతున్నామని తెలిపారు. పశువులు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకొని డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో వాహన దారుడు అబ్దుల్ ఖాన్ వాంకిడి పోలిస్ స్టేషన్ లో అన్నాన్, అబ్దుల్ రహేమాన్, రాజేంద్రప్రసాద్ ముగ్గురి పై కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
- పంజాబ్ రైతులు ఈడ్చి తన్నారు.. రాహుల్ కు హరీష్ రావు కౌంటర్
- కేసీఆర్ పేరు ఉచ్చరించని రాహుల్.?
- సరూర్ నగర్ పరువు హత్యపై అసదుద్ధీన్ ఓవైసీ ఘాటు స్పందన
- పెళ్లి పీటలేక్కబోతున్న సూపర్ క్వీన్.. దాంపత్య జీవితానికి తిరుమలలో శ్రీకారం
- రెండు సింహాల పోరు ట్విట్టర్ వేదికగా కేటీఆర్, రేవంత్ మాటల యుద్ధం