
- సరూర్ నగర్ నాగరాజు ఆశ్రిన్ సుల్తానా ప్రేమ వ్యవహారం
- ముస్లీం యువతిని ప్రేమించినందుకే నాగరాజు హత్యా ..?
- స్వయానా సుల్తానా సోదరుడే హత్యకు కుట్ర
- ఏ మతమైనా, నేరాన్ని ఘోరాన్ని ఖండిస్తామంటూ బీజేపీకి చురకలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ఇటీవల సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్ లో తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యకు కేవలం సొంత వ్యక్తే కారణమనే అనుమానాలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో ఎంఐఎం ఛీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఒవైసీ మాట్లాడుతూ..నాగరాజు అనే యువకుడిని ముస్లీం యువతి ఆశ్రిన్ సుల్తానా ఇష్టపడి, ప్రేమించి పెళ్ళి చేసుకున్న తర్వాతే ఆతడిని హత్య చేసినట్లు ఆరోపించారు. ఈ దారుణ ఘటన చట్టపరంగానే కాకుండా, అటు ముస్లీం సిద్దాంతల ప్రకారం మహా ఘోరమైన చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు. సుల్తాన్ సోదరుడు ఆమె భర్తను హత్య చేయడం క్రూరమైన చర్య అని ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.
Also Read : టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకాష్ రాజ్..!
సరూర్ నగర్ హత్య ఘటనకు రాజకీయ కోణంలోకి మార్చే ప్రయత్నాలు చేయం మానుకోవలని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించే కామెంట్స్ చేశారు. హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని… తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని స్పష్టం చేశారు. మరోవైపు, దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ… సరూర్ నగర్ ఘటనపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఒవైసీ స్పందించకపోవడం హత్యకు మద్దతునిచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హత్య ఘటనను ఖండిస్తూ ఒవైసీ స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి …
- పెళ్లి పీటలేక్కబోతున్న సూపర్ క్వీన్.. దాంపత్య జీవితానికి తిరుమలలో శ్రీకారం
- రెండు సింహాల పోరు ట్విట్టర్ వేదికగా కేటీఆర్, రేవంత్ మాటల యుద్ధం
- శవాలపై వైద్యుడి కాసుల వేట… పోస్ట్ మార్టంపై డాక్టర్ సందాని లంచం
- యాదాద్రి సాక్షిగా కేసీఆర్ పరువు గోవిందా!
- రేవంత్ రెడ్డి, కవిత మధ్య వార్.. తెలంగాణలో రాహుల్ రచ్చ