

- తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమాయణం
- ఎంగేజ్ మెంట్ అయ్యిపోయిందంటూ నయన్ ప్రకటన
- ఈ ఏడాది జూన్ 9న తిరుమలలో పెళ్లిపీటలెక్కబోతున్న అందాల రాశి
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటు సౌత్ ఇండియాలోనే కాదు అటు నార్త ఇండియాలోనూ తనకంటూ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాల్లో నాయికగా నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొడుతోంది . తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రస్తుతం ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిపై పెళ్లి పై గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నా పెళ్లి ఎప్పుడంటే మాత్రం ఏమో చూద్దాం అన్నట్లే దాటవేస్తూ వస్తున్నారు. అయితే.. చెట్టాపట్టాలేసుకొని షికార్లు, టూర్లతో ఈ కపుల్ ఎంజాయ్ చేస్తూ వస్తుంది. ఆ మధ్య ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ నయనతార తమకు గతంలో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని తెలింది.
Read More : నిద్రిస్తున్న క్రైమ్ నిర్మూలన విభాగం.. అవినీతి పరులకు అండగా అధికారి హస్తం..
దీంతో ఈ జంట పెళ్లి పీటలెప్పుడు ఎక్కుతుందా అని సౌత్ ఇండియా ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమాయణానికి ముగింపు పలికి, దాంపత్య బంధానికి స్వాగతం పలకాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 9న తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ముహూర్తం ఖరారు కావడంతో ఇక వివాహ వేదిక ఎంపిక, ఇతర ఏర్పాట్ల కోసం ఈ జంట శనివారం తిరుమల పర్యటనకి వచ్చారు. ముందుగా వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం, శ్రీవారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అయితే తమ పెళ్లికి వేదికను బుక్ చేసుకునేందుకు నయనతార తిరుమల వచ్చినట్లు సన్నిహితుల సమాచారం.
ఇవి కూడా చదవండి..
- రెండు సింహాల పోరు ట్విట్టర్ వేదికగా కేటీఆర్, రేవంత్ మాటల యుద్ధం
- శవాలపై వైద్యుడి కాసుల వేట… పోస్ట్ మార్టంపై డాక్టర్ సందాని లంచం
- యాదాద్రి సాక్షిగా కేసీఆర్ పరువు గోవిందా..!
- రేవంత్ రెడ్డి, కవిత మధ్య వార్.. తెలంగాణలో రాహుల్ రచ్చ
- టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకాష్ రాజ్!