
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : దేశంలో ప్రస్తుతం ఫ్రంట్ ల మీద చర్చ జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ కూటమి ప్లాన్ చేస్తోంది. మోడీ సర్కార్ ను ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అదే సమయంలో కొత్త కూటములపైనా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడో ప్రత్యామ్నాయ కూటమి దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలకు కూడగట్టే యోచనలో మమత ఉన్నారని ప్రచారం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ పైనా జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. కేసీఆర్ కూడా ఇటీవల తరుచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రులు, అధ్యక్షులతో చర్చలు జరిపారు. అయితే కొత్త కూటమి ఏర్పాట్లు మాత్రం ముందుకు సాగుతున్నట్లు కనిపించడం లేదు.
Read More : పచ్చి బాలింత.. పది కిలోమీటర్లు నడక.. ఇదేనా బంగారు తెలంగాణ!
జాతీయ స్థాయిలో జరుగుతున్న కొత్త కూటముల అంశంలో స్పెషల్ పర్సన్ గా ఉన్నారు జాతీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన డైరెక్షన్ లోనే బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకమవుతున్నాయనే వార్తలు వచ్చాయి. అటు మమత.. ఇటు కేసీఆర్ తో మంతనాలు జరిపారు పీకే. తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సోనియాతో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలతో రోజుల తరబడి రహస్య సమావేశాలు నిర్వహించారు ప్రశాంత్ కిషోర్. 2024 ఎన్నికలకు సంబంధించి సోనియాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నారని.. ఆయన డైరెక్షన్ లోనే కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు ఉంటాయని ప్రచారం సాగింది. కాని చివరకు కాంగ్రెస్ లో చేరేందుకు నిరాకరిస్తూ పీకే ప్రకటన చేయడంతో కొత్త కూటముల సంగతి మళ్లీ మొదటికొచ్చింది.
Also Read : వైసీపీలో రచ్చకెక్కిన వర్గపోరు… రాళ్లదాడిలో ఎమ్మల్యే కు గాయాలు
కాంగ్రెస్ లో చేరేది లేదని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. తాజాగా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. బీజేపీని ఓడించడం ఎలా సాధ్యమే వివరించారు. ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన పీకే.. దేశంలో మూడు, నాలుగో ఫ్రంట్ లు అవసరం లేదన్నారు. కమలం పార్టీని ఓడించాలంటే.. రెండో కూటమి ఏర్పడటం ఒక్కటే మార్గమన్నారు పీకే. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తేనే.. ఆ పార్టీని ఇంటికి పంపించడం సాధ్యమవుతుందన్నారు. మూడో ఫ్రంట్ కు దేశం అవకాశం ఉంటుందని తాను భావించడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
బీజేపీ ఒక ఫ్రంట్ గా ఉంటే.. దాన్ని వ్యతిరేకించేవాళ్లంతా మరో ఫ్రంట్ గా ఏకం అయితేనే ఏదైనా సాధ్యమన్నారు. బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కొగలదా అన్న ప్రశ్నకు స్పందించిన పీకే.. కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు లేవని చెప్పడం సరికాదన్నారు. హస్తం పార్టీలో కొన్ని మార్పులు చేస్తే.. మళ్లీ గాడిలో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు తేడా ఉంటుందని.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా జాతీయ ఫలితాన్ని అంచనా వేయలేమని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి ..
- ప్రశాంత్ కిషోర్ సంచలనం..
- తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. రాహుల్ సభలో కాంగ్రెస్ గూటికి తీన్మార్ మల్లన్న!
- గంట పార్కింగ్ కు 500..కేసీఆర్ సర్కార్ దోపిడి మాములుగా లేదుగా?
- కేటీఆర్ బూతు పురాణం వెనుక పీకేనా.. ఓటమి భయమా?
- హాస్పిటల్ బిల్డింగ్ కు వేలాడుతూ నర్సు డెడ్ బాడీ.. యూపీలో మరో దారుణం..
- పార్టీ మార్పుపై మాజీ మంత్రి జూపల్లి క్లారిటీ..
One Comment