
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : వికారాబాద్ జిల్లా తాండూరు టౌన్ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులతో కూర్చున్నా.. సీఐ రాజేందర్‌రెడ్డి వారించలేదనే ఆగ్రహంతోనే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సీఐకి ఫోన్‌కాల్ చేసినట్లు తెలుస్తోంది. సీఐ రాజేందర్‌రెడ్డిని తీవ్ర స్థాయిలో తిట్టాడు మహేందర్ రెడ్డి. రౌడీ షీటర్లు వస్తే ఎట్లా ఊకున్నవ్. మరి నీవేం పీకుతున్నవ్ అంటూ మండిపడ్డారు.
ఏం పీకుతున్నావ్ రా…అరేయ్ రికార్డు చేయ్‌రా… కార్పెట్ వేస్తే ఏం చేస్తున్నావ్‌రా అని ప్రశ్నించారు. దీనికి సీఐ స్పందించి.. ‘‘కార్పెట్ వేసే పని.. మాదా సార్ ?’’ అని బదులిచ్చారు. ‘‘రౌడీ షీటర్లకు ఎలా కార్పెట్ వేస్తారు?’’ అని ఎమ్మెల్సీ మరోసారి ప్రశ్నించారు. దీంతో ‘‘ఎమ్మెల్యే.. రౌడీ షీటరా?’’ అని సీఐ తిరిగి ప్రశ్నించారు.
Also Read : విదేశీ విద్యార్ధులపై యూఎస్ డేగకన్ను..? నకలీ డాక్యూమెంట్లతో విద్యార్దుల వలసలు
‘‘ఎమ్మెల్యే వెంట ఉన్నవాళ్లు ఎవర్రా.. ? నువ్వు అనుకోవచ్చు బిడ్డా.. సీఐగా ఇక్కడి నుంచి వెళ్లిపోయినా నీ తాట తీస్తా.. రేపటి నుంచి నీ సంగతి చూస్తా’’ అంటూ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సీఐని హెచ్చరించారు. దీనిపై సీఐ రాజేందర్‌రెడ్డిని వివర ణ కోరగా.. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తనను దూషించడంపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీపై తాండూరు పీఎ్‌సలోనూ ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. ‘‘సీఐపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. సీఐ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తా. అవసరమైతే హైకోర్టుకు ఎక్కుతా’’ అని చెప్పారు.
కాగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు బుధవారం రాత్రి తాండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. తాండూరు సీఐని అసభ్యకర పదజాలంతో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి దూషించడాన్ని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ బేషరుతుగా సీఐకి క్షమాపణలు చెప్పాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి ..
- లీటర్ పెట్రోల్ రూ. 70కే ఇవ్వొచ్చు.. ప్రధాని మోడీకి కేటీఆర్ సలహా..
- కఠోరశ్రమతోనే పోలీస్ కొలువు సాధ్యం
- రాష్ట్రం నుంచి దేశానికి నిచ్చెన.. దేశ రాజకీయాలకు కేసీఆర్ షురూ..
- వ్యవసాయ బావిలో మృతదేహాలు.. ఇక్కడ చేతిపై ట్యాటూ
- అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..!!
2 Comments