Telangana

సబితమ్మకు బిగ్ షాక్… పార్టీకి డివిజన్ అధ్యక్షుడు రాజీనామా

  • బీసీలకు ప్రాధాన్యత నిల్… అందుకే మనస్తాపం చెందాను: ఆకుల

క్రైమ్ మిర్రర్, రంగా రెడ్డి ప్రతినిది : మహేశ్వరం నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి,  పదవికి సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు  ఆయన,  నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి తన రాజీనామా లేఖను అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గ టిఆర్ఎస్ లో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే తాను పార్టీని వీడుతున్నట్లు గా ఆకుల అరవింద్ కుమార్ సన్నిహితులతో చెప్పుకొచ్చారు. బీసీల ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న అగ్రవర్ణాల నేతలు, రాజ్యాధికారంలో వారిని భాగస్వాములు కాని వ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read More : సరూర్ నగర్ టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాజీనామా..?

ఇకపై బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పుకొచ్చారు. సరూర్నగర్ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా కొనసాగిన ఆ కుల అరవింద్, గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఎన్నికల అనంతరం సబితా ఇంద్రారెడ్డి  కాంగ్రెసును వీడి, టిఆర్ఎస్ లో చేరిన తరువాత ఆకుల అరవింద్ ఆమె సమక్షంలోనే టిఆర్ఎస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. 

Also Rede : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ..  అసిస్టెంట్ డైరెక్టర్

డివిజన్ లో ఆకుల అరవింద్ కు ఉన్న పట్టును చూసి, ఆయన్ని టి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షునిగా సబితా ఇంద్రారెడ్డి నియమించారు.. అయితే సబిత తో పాటు గతంలో కాంగ్రెస్లో కొనసాగిన వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ, ఆకుల అరవింద్ ను విస్మరించడం వల్లే గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇవి కూడా చదవండి ..

  1. సరిహద్దు ప్రాంతంలో మావోల ఘాతుకం
  2. ప్రారంభ‌మైన ప్ర‌ణీత్ ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ పోటీలు
  3. మృతుడు చంద్రయ్య కుటుంబానికి ఆర్థిక సాయం: కర్నాటి
  4. ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన మరో మహిళ
  5. టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో 3.5 కోట్ల ఆస్తుల సీజ్
  6. న‌గ‌దు బ‌దిలీ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం యూట‌ర్న్

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.