
- దేశంలోనే భర్తపై హత్యలకు పాల్పడుతున్న భార్యలు
- విలాసాలకు, అక్రమ సబంధాలకు అలవాటు పడ్డ మహిళలు
- మహిళల వ్యసనాలే కారణమంటున్న విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, వనపర్తి: దేశంలోని మహిళలకు ఏమైందో అర్ధం కావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలను కూడా వివాహేతర సంబంధాల కోసం చంపేస్తున్నారు. మహిళల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులకు కారణమేంటి? ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా మహిళలు తమ భర్తలను చంపే కల్చర్ పెరిగిపోతోంది. ఇటీవల కర్నూలు జిల్లా కోడుమూరులోనూ ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పిల్లలను అనాధలను చేసింది.
తాజాగా వివరాల్లోకి వెళ్తే.. వనప్తరి జిల్లాలో కట్టుకున్న భర్తను ఓ భార్య సుపారీ ఇచ్చి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాంధీ నగర్‌కు చెందిన బాల స్వామికి లావణ్య అనే మహిళతో 10 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వీరి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. బాలస్వామి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం సంతోషంగానే సాగిపోతోంది. ఇదే సమయంలో నవీన్ అనే యువకుడితో లావణ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఇదే సమయంలో 5 నెలల క్రితం బాల స్వామి పొలం అమ్మడంతో 30 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో ప్రియుడితో చెక్కేయాలనుకున్న లావణ్య.. భర్తను చంపేందుకు పక్కా ప్లాన్ వేసింది. అర్ధరాత్రి వేళ మైసమ్మ గుడి దగ్గరకు వెళ్లి కోడిపుంజును కోసి రావాలని భార్య చెప్పడంతో బాలస్వామి నమ్మేశాడు. అక్కడికి వచ్చిన బాలస్వామిని బలవంతంగా కారులో ఎక్కించి గొంతు నులిపి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్ బాలాపూర్ శివారులోని స్మశాన వాటిక సమీపంలో పూడ్చిపెట్టారు. లావణ్య కూడా కనిపించక పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. లావణ్య సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా వనపర్తి శివారులో ఆమెను పట్టుకున్నారు. లావణ్య ప్రియుడు నవీన్, మరో ముగ్గురు నిందితులను కూడా అదువులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. విచారణలో శవాన్ని ఎక్కడ పాతి పెట్టారో కనుక్కుని.. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
- టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో 3.5 కోట్ల ఆస్తుల సీజ్
- నగదు బదిలీ విషయంలో ఏపీ ప్రభుత్వం యూటర్న్
- ఆ ఇద్దరే హంతకులు… ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
- తల్లి కాబోతున్న సింగర్ సునీత… ఇన్ డైరెక్టుగా చెప్పారా?
- రేవంత్ టెంట్ మాస్టర్… అరవింద్ దొంగ,దగుల్బాజీ, డెకాయిట్!
2 Comments