
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహ రాములు నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 3.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శేరిలింగంపల్లి పట్టణ ప్రణాళిక అధికారి నర్సింహ రాములు నివాసంలో ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. స్థిర, చర ఆస్తులు కలిసి మొత్తం 3.5 కోట్ల రూపాయల మేర ఉన్నట్టు అనిశా తనిఖీల్లో బయటపడింది.
శేరిలింగంపల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయంతో పాటు దిల్‌సుఖ్‌నగర్, వాసవినగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో నాలుగు బృందాలు సోదాలు జరిపాయి. ఇళ్లు, ఇంటి స్థలాలకు చెందిన పత్రాలతో పాటు రెండున్నర కిలోల బంగారం, మూడున్నర కిలోల వెండి ఆభరణాలు అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి. ఈ మేరకు రాములును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి ..
- ఆ ఇద్దరే హంతకులు… ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
- తల్లి కాబోతున్న సింగర్ సునీత… ఇన్ డైరెక్టుగా చెప్పారా?
- తెలంగాణలో మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్..
- భూకబ్జా కేసులో ఏపీ బీజేపీ ఎంపీ.. తీవ్రంగా స్పందించిన బండి సంజయ్
- వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవే..?
2 Comments