
- విలాసాల కోసం విచ్చల విడిగా ప్రవర్తించిన మహిళ
- వివాహేతర సంబంధం ప్రాణాంతకంగా మారిన వైనం
- గుట్టుచప్పుడు కాకుండా హంద్రీనదిలో పూడ్చివేత
- శవాన్ని వెలికి తీయించిన పోలీసులు
- కటకటాల వెనక్కు లక్ష్మీ, ఆమె ప్రియుడు
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కష్టపడితే వచ్చే సోమ్ము సరిపోదనుకుందో ఏమో., మరింత విలాసవంతమైన జీవితం కోసం దీర్ఘంగా ఆలోచించింది. ఎక్కడికి వెళ్లినా, అదే కష్టం, అదే జీతం.. మరోవిధంగా చెప్పాలంటే గొర్రెకు బెత్తెడు తోక. ఈ అండర్ బతుకంటే మరేదో జీవితం దాగి ఉందని, ఆదేమిటో ఆలోచించి,. ఆచరణలో పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది ఆ మహిళ, పేరు లక్ష్మీ,. అసలు కథలోకి వెళ్లితే .. హైదరాబాద్ మహానగరం.., ఎక్కడి నుంచో బతుకు దెరువు కోసం నగరానికి వచ్చాడు సుధాకర్., తన భార్య లక్ష్మీ, మరో ఇాద్దరు కుమారులతో పల్లెల్లో కూలిపనికంటే పట్టణంలో కూలిపని ఎంతో కొంత మెరుగైందే అనుకున్న ఈ దంపతులు అదే కూలిపనికి వెళ్లేవారు.
Also Read : తెలంగాణలో ఫ్యాక్షన్ సీన్.. టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య
ప్రతీరోజు పొద్దునే పనికి వెళ్లి, సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చే తన భర్త, ఏప్రిల్ 18-2022 నుంచి ఇంటికి రావడంలేదని తన అత్తమామలకు కబురు పంపింది లక్ష్మీ. దాంతో కంగారు పడిన సుధాకర్ తండ్రి, ఏప్రిల్ 20 2022 న స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదుచేసుకుని రంగంలోకి దిగారు. ఎప్పుడు బయటకు వెళ్లింది, ఎక్కడ పనిచేస్తుంది. ఎప్పుడు ఇంటికి వస్తుంది, స్నేహితులు, బంధువులు, శత్రువులు ఇలా ఒక్కో కోణంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగే నిజం బయట పడింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.. అనే సామెత గుర్తుకు వచ్చిన పోలీసులు మొదటగా సుధాకర్ భార్య లక్ష్మీనే ఇంటరాగేట్ చేసారు..
సీన్ కట్ చేస్తే.. పోలసులు చేప్పిన వివరాలు.. పట్టణంలోని దళితవాడకు చెందిన సుధాకర్, లక్ష్మిలకు 8 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఈ దంపతులు కూలి పని చేసుకొని జీవించేవారు. అయితే పంచాయతీ బోర్డులో స్వీపరుగా పని చేసే దస్తగిరితో లక్ష్మికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి సుధాకర్ భార్యను మందలించాడు. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. లక్ష్మి ఇంటి నుంచి వెళ్లి దస్తగిరితో కలిసి ఉండటం మొదలు పెట్టింది. అయినా భార్య మీది ప్రేమతో సుధాకర్ లక్ష్మిని కాపురానికి తీసుకొచ్చుకున్నాడు. అయితే ఈ నెల 18న సుధాకర్ అదృశ్యం అయ్యాడు. దీంతో తన కుమారుడు కనిపించడం లేదని ఆయన తండ్రి ఈ నెల 20న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొన్న ఎస్‌ఐ విష్ణునారాయణ లక్ష్మి, దస్తగిరి మీద అనుమానంతో విచారణ చేపట్టి నిజాలను వెలికి తీశారు.
పథకం ప్రకారం హత్య… లక్ష్మి తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డంగా ఉన్నాడని భావించి దస్తగిరితో కలిసి ప్లాన్ వేసినట్లు తెలిపారు. ఈ నెల 18న భార్యా భర్తల వివాదం పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. రాత్రి 9గంటల సమయంలో స్టేషన్ నుంచి బయటికి వచ్చిన భార్యా భర్తలు పాత బస్టాండ్‌లో రోడ్డు మీద గొడవ పడ్డారు. ముందుగాను ప్లాన్ వేసుకొన్న పథకం ప్రకారం దస్తగిరి అక్కడికి చేరుకొన్నారు. అతను తీసుకొచ్చిన ఆటోలో సుధాకర్‌ను ఎక్కించుకొని హంద్రీనది సమీపానికి వెళ్లారు. ఇద్దరూ కలిసి సుధాకర్‌ను రాయితో కొట్టి చంపేశారు. గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని హంద్రీనదిలో పూడ్చిపెట్టారు.
Also Read : యాదాద్రి జిల్లాలో మరో పరువు హత్య! అ్లలుడిని చంపేసిన మామ
కర్నూలు డీఎస్పీ మహేష్ శుక్రవారం కోడుమూరుకు చేరుకొని విచారణ చేపట్టిన అనంతరం హంద్రీనదిలోకి వెళ్లి తహసీల్దార్ ఉమామహేశ్వరమ్మ, వీఆర్వోలు నారాయణ, ఎల్లప్పల సమక్షంలో సుధాకర్ శవాన్ని వెలికి తీయించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన శవాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సుధాకర్ హత్య కేసును లక్ష్మి, దస్తగిరిపై నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
- తల్లి కాబోతున్న సింగర్ సునీత… ఇన్ డైరెక్టుగా చెప్పారా?
- రేవంత్ టెంట్ మాస్టర్… అరవింద్ దొంగ,దగుల్బాజీ, డెకాయిట్!
- చంద్రబాబుకు నోటీసులు… ఏం జరగబోతోందో?
- నాడు ఫ్యాక్టరీపై పోరాటం.. నేడు జగనే ప్రారంభం
- సీఎం కాన్వాయ్ కోసం కారు లాక్కుంటారా… ఇదేం పాలన జగనన్నా!
2 Comments