
క్రైమ్ మిర్రర్, అమరావతి : విజయవాడ గ్యాంగ్ రేప్ ఘటన ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు రేపుతోంది. విపక్షాలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు బాధితురాలిని పరామర్శించారు. చాలా ఆవేశంగా మాట్లాడారు. ఏపీకి అవమానమంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు నోటీసులు రావడం సంచలనంగా మారింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో అత్యాచార బాధితురాలిని పరామర్శించారు. ఆ సందర్భంగా, అక్కడే ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో తీవ్ర వాగ్యుద్ధానికి దిగారు. . ఈ ఘటనను వాసిరెడ్డి పద్మ తీవ్రంగా పరిగణించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదాలో నోటీసులు పంపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధితురాలని పరామర్శించేందుకు వెళ్లిన తన గౌరవానికి భంగం కలిగించే విధంగా చంద్రబాబు ప్రవర్తించారని ఆరోపించారు. తన పట్ల అవమానకర రీతిలో వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ ఎదుట చంద్రబాబు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.
టీడీపీ నేత బోండా ఉమకు కూడా మహిళా కమిషన్ నుంచి ఇవే తరహాలో నోటీసులు అందాయి. ఆయనను కూడా ఈ నెల 27న మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి వ్యక్తిగతంగా రావాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి ..
- రేవంత్ టెంట్ మాస్టర్… అరవింద్ దొంగ,దగుల్బాజీ, డెకాయిట్!
- నాడు ఫ్యాక్టరీపై పోరాటం.. నేడు జగనే ప్రారంభం
- సీఎం కాన్వాయ్ కోసం కారు లాక్కుంటారా… ఇదేం పాలన జగనన్నా!
- 3 గంటలు రోజా హైరానా.. ఉరుకులు పరుగులు.. ఏమైందో తెలుసా!
- తెలంగాణలో ఫ్యాక్షన్ సీన్.. టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య
2 Comments