
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న 84 గ్రామాలలో నిర్మాణాలపై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేసింది. ఈ మేరకు జీవో నెంబరు 111 పేరిట ఏళ్లుగా కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేస్తూ జీవో నెంబరు 69ని జారీ చేసింది. కేసీఆర్ సర్కార్ తాజా జీవోతో జంట జలాశయాల పరిధిలో ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. కొత్త జీవో ప్రకారం పాత జీవో ఆధారంగా అమల్లోకి వచ్చిన ఆంక్షలన్నీ రద్దయిపోయాయి.
Read More : అర్ధరాత్రి అమ్మాయి దగ్గర డబ్బుల్ వసూల్! కానిస్టేబుల్, హోంగార్డ్ అరెస్ట్
జంట జలాశయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. జంట జలాశయాల చుట్టూ గ్రామాల్లో stp ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.Stp ల నీరు జంట జలాశయాల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది.భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు ఉంటాయని వెల్లడించింది.111 జి ఓ ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల క్యాబినెట్ లో తీర్మానం చేసి,నేడు ప్రత్యేకంగా 69 జిఓ విడుదల చేయటంతో 84 గ్రామాల ప్రజలకు శాశ్వత విముక్తి లభించిందన్నారు. జంట జలాశయాలు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేయటం శుభ పరిణామం అన్నారు సబితా ఇంద్రారెడ్డి. 84 గ్రామాల ప్రజల దీర్ఘకాల సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్ , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు సబితా.
ఇవి కూడా చదవండి ..
- సీఎం కాన్వాయ్ కోసం కారు లాక్కుంటారా… ఇదేం పాలన జగనన్నా!
- 3 గంటలు రోజా హైరానా.. ఉరుకులు పరుగులు.. ఏమైందో తెలుసా!
- తెలంగాణలో ఫ్యాక్షన్ సీన్.. టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య
- తెలంగాణలో మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్..
- బిగ్ బ్రేకింగ్.. జగన్ కు థ్యాంక్స్ చెప్పిన చంద్రబాబు
One Comment