
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేలా కనిపిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు వెయ్యికి వరకు నమోదు అయిన రోజువారి కేసులు..తాజాగా రెండువేల మార్క్‌ను దాటేశాయి. ఇటు మరణాల సంఖ్య అధికంగా ఉంది. 24 గంటల వ్యవధిలో మరణాలు 200లకు పైగా నమోదు అయ్యాయి. కొత్తగా 2.6 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా..2 వేల 183 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. అత్యధికంగా కేరళలో 940, ఢిల్లీలో 517 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Read More : క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… మర్రిగూడ తహసీల్దార్ పై బదిలీ వేటు
ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలో 19 వందల 85 మంది కరోనా నుంచి కోలుకున్నారు. క్రియాశీల కేసులు 11 వేల 542కు చేరాయి. మొత్తం రికవరీ శాతం 98.76గా ఉంది. ఇటు దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ ఆందోళన కల్గిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఢిల్లీ పరిసరాల్లో 15 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఓ సర్వేలో తేలింది. దీంతో ఆప్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంక్షలను కఠినతరం చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇటు కేరళలోనూ కేసులు అధికంగా ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మాస్క్ నిబంధన మళ్లీ అమలు చేసే అవకాశం ఉంది. ఫోర్త్ వేవ్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దేశ రాజధానిలో కేసులు రెట్టింపు అవుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు.
Read More : రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. పీకేతో కేసీఆర్ గేమ్?
మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిన్న 2.66 లక్షల మంది టీకా తీసుకున్నారు. ప్రస్తుతం 18 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోస్ అందిస్తున్నారు. ఇప్పటివరకు టీకా ఉద్యమంలో 186 కోట్ల డోసులను పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి ..
- భువనగిరి పరువు హత్య.. 10 లక్షల సుపారీ
- ఏజేన్సీల్లో మావోల అలజడి
- విజయసాయిని తిట్లతో కుమ్మేసిన బండ్ల గణేష్
- వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవే..?
- ఢిల్లీకి కేసీఆర్ మకాం… కేటీఆర్ కు సీఎం పీఠం!
2 Comments