
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధమైంది. శనివారం సోనియా సహా కాంగ్రెస్ నేతలతో పీకే సమావేశం కావడంతో ఆయన హస్తం గూటికి చేరడం ఖాయమైంది .వాస్తవానికి గత ఏడాదే పీకే కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. కానీ అందుకోసం జరిగిన చర్చలు సఫలం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్‌తో పాటు రాహుల్ పై పీకే బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా సోనియాతో ఆయన భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వ్యూహకర్తగా కాకుండా పార్టీలోనే చేరాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పీకేను కోరినట్లు సమాచారం. అందుకు ప్రశాంత్ కిశోర్ సైతం ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
పీకే కాంగ్రెస్ లో చేరబోతుండటం ఆ పార్టీకి ప్లస్ అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండగా… తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇది షాకింగ్ న్యూస్ అంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా ఉన్నారు పీకే. తెలంగాణ వ్యాప్తంగా కారు పార్టీ కోసం పీకే టీమ్ సర్వేలు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని మీడియా సాక్షిగా చెప్పేశారు. అంతేకాదు ప్రశాంత్ కిషోర్ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసించారు. పీకే టీఆర్ఎస్ కోసం పని చేస్తుండటంతో అతన్ని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. పీకేలు ఏమి పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read More : విజయసాయిని తిట్లతో కుమ్మేసిన బండ్ల గణేష్
కాంగ్రెస్ పార్టీకి పీకేలు అవసరం లేదని.. 40 లక్షల మంది ఏకే 44 గన్ లాంటి కార్యకర్తలు ఉన్నారని కామెంట్ చేశారు. పీకేపైనా వ్యక్తిగత విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.పీకేలు ఏమి పీకలేరంటూ రేవంత్ రెడ్డి గతంలో విమర్శలు చేయగా… ఇప్పుడే అతనే కాంగ్రెస్ వ్యూహకర్తగా ఉండబోతున్నారు. ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. పీకేపై గతంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. దీనిరి కౌంటర్ ఇవ్వలేక రేవంత్ టీమ్ తంటాలు పడుతోంది.
మరోవైపు పీకే- సోనియా మీటింగ్ తో మరో చర్చ కూడా సాగుతోంది.కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా పీకే ఒక ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం.370 నుంచి 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకోవాలని సోనియాకు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో వ్యూహాత్మక కూటములను ఏర్పాటు చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కూటమికి అవకాశం ఉందంటున్నారు. కేసీఆర్ తో మంచి సంబంధాలున్న పీకే.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీని టార్గెట్ చేస్తున్న కేసీఆర్.. కాంగ్రెస్ పై కొంత సాఫ్ట్ గా వెళుతున్నారు.
Also Read : చైనాలో కొవిడ్ కల్లోలం.. ఆంక్షలతో 40 కోట్ల మందికి నరకం
ఈ నేపథ్యంలో కాంగ్రెస్, కారు పార్టీల పొత్తు అసాధ్యమేమి కాదంటున్నారు. టీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ చెప్పారని పీసీసీ నేతలు చెబుతున్నా… ఎన్నికల నాటికి ఏదైనా జరగవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే కేసీఆర్ లక్ష్యంగానే రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే.. రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బేనని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి ..
- క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… మర్రిగూడ తహసీల్దార్ పై బదిలీ వేటు
- ఢిల్లీకి కేసీఆర్ మకాం… కేటీఆర్ కు సీఎం పీఠం!
- ఆరోగ్య మిత్రలను గుర్తించండి- గిరి యాదయ్య
- ఏపీ ధాన్యం లారీలకు తెలంగాణ నో ఎంట్రీ..
- ప్రేమించిన భార్య.. ఘోర హత్యకు గురైన ప్రేమికుడు