
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి మకాం మారుస్తున్నారా? తెలంగాణ రాజకీయాల్లో సంచనం జరగబోతుందా ? అంటే రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల కాలంలో కేసీఆర్ తరచూ ఢిల్లీ వెళుతున్నారు. వస్తున్నారు. అయితే ఢిల్లీ లో ఉన్న సమయంలో ఆయన ఏమి చేశారు, ఎవరిని కలిశారు వంటి వివరాలు అధికారికంగా తెలియడం లేదు. ఏప్రిల్ 3న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఏకంగా ఎనిమిది రోజుల పాటు అక్కడే ఉన్నారు. అంతకు ఐదారు రోజుల ముందు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళుతున్నారని, ప్రత్యెక విమానం సిద్దమై పోయిందంటూ బ్రేకింగ్ వార్తలు వచ్చాయి. అయితే ఆ రోజు ఆయన ఢిల్లీ వెళ్ళలేదు. కానీ ఏప్రిల్ 3 న, హఠాత్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్’ ఢిల్లీ వెళ్ళారు. కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మరో ఇద్దరు ముగ్గురు సన్నిహితులు కూడా ఆయన వెంట ఢిల్లీ వెళ్లారు.
Also Read : తెలంగాణలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లంటే.. లేటేస్ట్ సర్వేలో సంచలనం…
ఏప్రిల్ 11న, యాసంగి ధాన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనాలనే డిమాండ్‌తో ఢిల్లీ తెలంగాణ భవన్ లో నిర్వహించిన దీక్షలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పోరాటం చేసిన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మళ్ళీ ఢిల్లీ వస్తానని, బీజేపే వ్యతిరేక శక్తులు అన్నింటినీ, ఏకం చేస్తానని ప్రకటించారు కేసీఆర్. మళ్ళీ రేపో మాపో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని, మళ్ళీ మరో వారం పదిరోజులు, అవసరం అయితే ఇంకా ఎక్కువ రోజులే అక్కడే ఉంటారని అంటున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమత్రి ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖీరీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రైతు కుటుంబాలకు పరిహారం అందిస్తారట తెలంగాణ ముఖ్యమంత్రి.
అయితే ఇదంతా జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు చోటు కలిపించేందుకు ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిశోర్ రచించిన వ్యూహంలో భాగంగా సాగుతోందని ఒక ప్రచారం జరుగుతోంది. అందుకే పీకే సలహా మేరకు ముఖ్యమంత్రి, బీహరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ కుమార్ ఝాను పీఆర్ఓగా నియమించుకున్నారు. మరోవైపు ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న నేపధ్యంలో కేటీఆర్ ను ఎన్నికలకు ముందుగానే ముఖ్యమంత్రిని చేసే ఆలోచన కూడా ఉందని, అందుకే ముఖ్యమంత్రి ఢిల్లీకి మకాం మారుస్తున్నారని అంటున్నారు. అందుకే ఇక ముఖ్యమంత్రి ఢిల్లీకి మకాం మార్చినట్లేనని అంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. పీకేతో కేసీఆర్ గేమ్?
- ఆరోగ్య మిత్రలను గుర్తించండి- గిరి యాదయ్య
- ఏపీ ధాన్యం లారీలకు తెలంగాణ నో ఎంట్రీ..
- ప్రేమించిన భార్య.. ఘోర హత్యకు గురైన ప్రేమికుడు
- విజయసాయిని తిట్లతో కుమ్మేసిన బండ్ల గణేష్
3 Comments