
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): ఆరోగ్య మిత్రాలను ఆయుష్మాన్ భారత్ మిత్రాలుగా కేటాయించాలని ఆరోగ్య శ్రీ ఎంప్లాయిస్ యూనియన్ నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గిరి యాదయ్య డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ప్రస్తుతం ఉన్న 13400 జీతాని 23000 రూపాయలకు పెంచుతూ, డాటా ప్రాసెసింగ్ ఆఫిసర్ గా క్యాడర్ ఇప్పించాలని, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి వినతి పత్రం అందించారు.
Also Read : తెలంగాణలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లంటే.. లేటేస్ట్ సర్వేలో సంచలనం…
ఈ సందర్బంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మమల్ని కూడా సమానంగా చూడాలని, ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. కనీసం ఆరోగ్య మిత్ర చనిపోతే ప్రభుత్వం ఆర్ధికంగా కూడా వారి కుటుంబాని ఆదుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం మాపై ద్రుష్టి సారించి న్యాయం చెయ్యాలని గిరి యాదయ్య ప్రభుత్వాని కోరారు.
ఇవి కూడా చదవండి ..
- ఏపీ ధాన్యం లారీలకు తెలంగాణ నో ఎంట్రీ..
- ప్రేమించిన భార్య.. ఘోర హత్యకు గురైన ప్రేమికుడు
- విజయసాయిని తిట్లతో కుమ్మేసిన బండ్ల గణేష్
- హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర.. 8 వేల మంది పోలీసులతో పహారా
- చైనాలో కొవిడ్ కల్లోలం.. ఆంక్షలతో 40 కోట్ల మందికి నరకం