
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి కొనుగోళ్ల యుద్ధం ముదురుతోంది. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ఇంటిని రైతులు చుట్టుముట్టారు. మంగళవారం ఉదయం ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్‌లో ఉన్న అర్వింద్ ఇంటి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం వడ్లను కొనడం లేదని, రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎంపీ నివాసం ముందు ధాన్యాన్ని పారబోసి నిరసన తెలిపారు.
పసుపు బోర్డు ఏర్పాటుకు రైతులకు బాండ్ రాసిచ్చి మోసం చేసిన అర్వింద్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ధాన్యం కోనుగోలు చేసేలా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని రైతులు ఎంపీ ఇంటివద్ద నిరసనకు దిగడంతో అక్కడికి బీజేపీ నాయకులు భారీగా చేరుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- పర్యావరణమా.. నీ జాడెక్కడ..?
- ప్రయాణికులపై దూసుకెళ్లిన రైలు.. శ్రీకాకుళంలో ఐదుగురు దుర్మరణం
- అసమ్మతి నేతలపై జగన్ ఫోకస్.. బాలినేనికి కీలక పదవి ?
- అక్బరుద్దీన్ కేసులో ఇవాళ తుది తీర్పు.. హైదరాబాద్ లో హై టెన్షన్
- జగన్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి.. క్యాబినెట్లో బీసీలకు జగన్ పెద్దపీట
One Comment