
- ఉచిత శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- పండుగ వేళ నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే
క్రైమ్ మిర్రర్, పరిగి ప్రతినిధి : నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతి, యువకులు ఉచిత శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోని ఉద్యోగాలు సంపాదించాలని స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆయన నివాసంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం పరిగి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు పట్టణంలోని శారద గార్డెన్-2లో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఈ నెల 11 నుండి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నేటి నుండి ఈ నెల 10 వరకు ఎమ్మెల్యే నివాసంలో, పట్టణంలోని పల్లవి, వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలతో పాటు నియోజక వర్గంలోని అన్ని పోలీస్టేషన్ లలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకుగాను దరఖాస్తు పారంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ,రెండు ఫొటోలు, ఇంటర్, డిగ్రీ సెర్టిఫికెట్లు జత చెయ్యాలని తెలిపారు. నిరుద్యోగ యువతి, యువకుల కోసం నగరంలో ప్రఖ్యాతి గాంచిన అత్యుత్తమ శిక్షణ కేంద్రమైన పిజెర్ సంస్థ వారి సిబ్బందితో బోధన ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read More : పవిత్రమైన వృత్తిలో ఉంటూ పాడు పనిచేసిన డాక్టర్
ఉచిత శిక్షణ కేంద్రంలో నిరుద్యోగులకు ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్- 3, గ్రూప్- 4, సిఐఎస్ఎఫ్, బిఎసెఫ్, ఆర్ఆర్ బి, పంచాయతీరాజ్, టెట్, మొదలగు వాటిపై శిక్షణ ఇవ్వబడునని తెలిపారు. శిక్షణ కేంద్రానికి వచ్చిన ప్రతి విద్యార్థికి ఉచిత మెటీరియల్స్, మధ్యాన్నం భోజనంతో పాటు దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం, బస్ పాస్ లు తానే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
వివరాలకై ఫోన్ నంబర్లు నర్సింహా రెడ్డి : 9440554675, రాజశేఖర్ : 9949535111, రఘు వర్ధన్ రెడ్డి : 9100491109 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఈ సువర్ణ అవకాశాన్ని పరిగి నియోజకవర్గ నిరుద్యోగులందరు సద్వినియోగం చేసుకోని ఉద్యోగం సాధించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
- అంకుర్ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం.. బాబు మృతి.
- “తెప్ప సముద్రం” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- పవన్ పార్టీ బీజేపీలో విలీనం!
- ఎలుకలు కొరికిన శ్రీనివాస్ మృతి.. వరంగల్ ఎంజీఎంలో కలకలం
- కేబినెట్ లోకి తమ్మినేని.. స్పీకర్ గా ధర్మాన?
One Comment