
క్రైమ్ మిర్రర్, వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో బాలిక దారుణ హత్యకు గురి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు. హత్య వెనక ప్రేమ వ్యవహారం ఉందని ప్రచారం జరిగింది. బహిర్భూమికి అని వెళ్లిన బాలిక హత్యకు గురవడం విషాదాన్ని నింపింది.పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఓ బాలిక హత్యకు గురైందన్న సమాచారంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది..
Read More : మునుగోడుపై పీకే టీమ్ రిపోర్ట్.. కొత్త నేతకే టికెట్?
ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు గురైన బాలికపై అత్యాచారం, ఆతర్వాత హత్య ఓ పథకం ప్రకారమే జరిగినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమ్మాయిని ఒంటరిగా పిలిచి అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం.ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం అరెస్ట్ చేసిన వారిలో మహెందర్ అనే వ్యక్తి హత్యకు గురైన ఇంటికి సమీపంలోనే కొత్త ఇళ్లు నిర్మాణం చేశాడు. ఇళ్లు పూర్తి కావడంతో స్నేహితులను పిలిచి ఆదివారం రాత్రి పార్టీ ఇచ్చాడు.
Read More : వాళ్లకు టికెట్లు ఇస్తే గోవిందా… కేసీఆర్ కు పీకే టీమ్ రిపోర్ట్!
ఈ క్రమంలోనే అప్పటికే హతురాలు పరిచయం ఉండడంతో ముందుగానే సోమవారం తెల్లవారుజామున ఆమెను పిలిపించినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిర్మానుష్యప్రాంతానికి చేరుకున్న బాలికపై ఒక్కరే అత్యాచారం చేశారా.. లేక సాముహిక అత్యాచారం చేశారా అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. అత్యాచారం సంధర్భంలో బాలిక వ్యతిరేకించినందుకే అలా చేశారా అనే కోణంలో కూడా పోలీసుల విచారణలో తేలనున్నట్టు చెబుతున్నారు. హత్యకు సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇవి కూడా చదవండి ..
- గ్యాంగ్ స్టర్ నయీం బినామీలెవరు?
- ఎమ్మెల్యే తమ్ముడికి దళిత బంధు.. ఇదేందయా కేసీఆర్!
- సభ్య సమాజానికి తలవంపు..! కామపిశాచితండ్రే…కన్న కూతురి పై అత్యాచారం…
- యాదాద్రిలో కోమటిరెడ్డికి అవమానం?
- యూపీలో బీజేపీకి బీఎస్పీ సాయం… రాష్ట్రపతిగా మాయావతి ?
- సీఎం నితీశ్ కుమార్ పై దాడి.. బీహార్ లో కలకలం